Cyclone Arnab Landfall: తీరం దాటిన అర్నబ్ తుఫాన్.. మరో 6–7 గంటలు కీలకం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Arnab Landfall Complete: అర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటింది. యానాం–నరసాపురం మధ్య, కోనసీమ ప్రాంతానికి సమీపంలో తుఫాన్ తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. యానాంకు నైరుతి దిశలో, నరసాపురానికి దగ్గరగా తీరాన్ని దాటిన అర్నబ్ తుఫాన్ పూర్తిగా భూమిపైకి చేరింది. ఈ క్రమంలో అతి తీవ్ర తుఫాన్ నుంచి తీవ్ర తుఫాన్‌గా బలహీనపడింది. తుఫాన్ తీరం దాటినప్పటికీ దాని ప్రభావం పూర్తిగా తగ్గలేదని అధికారులు పేర్కొన్నారు. రానున్న ఆరు నుంచి ఏడు గంటలు కీలకమని, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. తుఫాన్ కదలికలు, వాతావరణ పరిస్థితులను వాతావరణ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తీరం దాటిన నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కొనసాగనున్నాయి. ముఖ్యంగా తీరప్రాంతాలు, కోనసీమ, గోదావరి జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. బలమైన ఈదురుగాలులు వీచే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గేవరకు ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, సహాయక బృందాలు అందించే సమాచారాన్ని గమనించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read
- Cyclone Arnab: అలర్ట్.. ఏపీని వణికిస్తున్న తుఫాను.. అర్నబ్ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ.. భారీ వర్ష సూచన..
- Cyclone Arnab: ఉప్పాడ తీరంలో రాకాసి అలల బీభత్సం.. 30 ఇళ్లు నేలమట్టం, కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసం!
- ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
- Cyclone Arnab: వేలాది ఎకరాల్లో నేలకొరిగిన అరటి, చెరకు తోటలు.. కోట్లలో నష్టం.. కన్నీరుమున్నీరవుతున్న రైతులు!
తాజావార్తలు
-
Cyclone Arnab Landfall: తీరం దాటిన అర్నబ్ తుఫాన్.. మరో 6–7 గంటలు కీలకం!
-
Cyclone Arnab: అలర్ట్.. ఏపీని వణికిస్తున్న తుఫాను.. అర్నబ్ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ.. భారీ వర్ష సూచన..
-
SCO Civilisational Dialogue Forum: ఆపరేషన్ సిందూర్ తర్వాత కీలక పరిణామం.. SCO సమావేశానికి పాక్ మంత్రికి భారత్ ఆహ్వానం!
-
Cyclone Arnab: ఉప్పాడ తీరంలో రాకాసి అలల బీభత్సం.. 30 ఇళ్లు నేలమట్టం, కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసం!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
ట్రెండింగ్
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..