Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Cyberabad Police Swimming Pool Safety Guidelines Children

Cyberabad Police: ఈత.. కారాదు కడుపు కోత! పేరెంట్స్‌కి పోలీసులు కీలక సూచనలు..

Published Date :January 6, 2026 , 7:49 am
By RAMAKRISHNA KENCHE
Cyberabad Police: ఈత.. కారాదు కడుపు కోత! పేరెంట్స్‌కి పోలీసులు కీలక సూచనలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Cyberabad Police: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు స్విమ్మింగ్ పూల్‌లలో పడి ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న విషాదకర ఘటనలు కలచివేస్తున్నాయని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. చిన్న పాటి నిర్లక్ష్యం కారణంగా కన్నవారికి కడుపు కొత్త మిగిలిస్తున్నారన్నారు.. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులకు కీలక సూచనలు చేస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రకటన ప్రకారం.. కుటుంబ సభ్యుల మధ్య సరైన సమన్వయం లేకపోవడం, అపార్ట్మెంట్ ప్రాంగణాల్లో తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, పూల్ పర్యవేక్షణలో లోపించడం వంటి అంశాలు ఈ ఘటనలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాంతకంగా మారవచ్చని ఈ సంఘటనలు మనకు స్పష్టం చేస్తున్నాయి. పిల్లల భద్రత ఒక్కరి బాధ్యత, కుటుంబం, అపార్ట్మెంట్ మేనేజ్‌మెంట్, సమాజం అందరూ కలిసి తీసుకోవాల్సిన సమిష్టి బాధ్యత. పర్యవేక్షణ, స్పష్టమైన భద్రతా నియమాలు, ముందస్తు జాగ్రత్తలతో ఇలాంటి విషాదాలను నివారించవచ్చు.

READ MORE: Shikhar Dhawan Marriage: రెండో పెళ్లి చేసుకోబోతున్న ‘గబ్బర్’.. ఎవరీ సోఫీ షైన్‌!

ఇటీవల మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతి చెందిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుందని సైబరాబాద్ పోలీసుల వెల్లడించారు. బాలుడి తాత వాకింగ్ కోసం మనవడిని తీసుకొని భవనం కిందికి వచ్చారు. ఆయన చుట్టు పక్కల ప్రాంతంలో వాకింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాలుడు ఆడుకుంటూ వెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత మనవడు కనిపించకపోవడంతో స్విమ్మింగ్ పూల్‌లో వెతికారు. బాలుడు అందులో విగతజీవిగా కనిపించాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కేపీహెచ్‌బీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో చిన్నారుల భద్రత కోసం సైబరాబాద్ పోలీసు సూచనలు చేశారు.

READ MORE: TheRajaSaab : రాజాసాబ్.. నాచే నాచే సాంగ్.. రాసి పెట్టుకోండి.. థియేటర్లు తగలబడిపోతాయ్!

స్విమ్మింగ్ పూల్ భద్రతా సూచనలు:

1. స్విమ్మింగ్ పూల్ చుట్టూ భద్రతా కంచె లేదా గేట్లు ఏర్పాటు చేయాలి; గేట్లకు తాళాలు తప్పక పెట్టాలి.
2. నిపుణులైన లైఫ్ గార్డ్ లేదా శిక్షణ పొందిన భద్రతా సిబ్బంది ఉన్నప్పుడు మాత్రమే పూల్ ఉపయోగించాలి.
3. చిన్నపిల్లలను ఎల్లప్పుడూ పెద్దవారి పర్యవేక్షణలో ఉంచాలి.
4. రాత్రి లేదా ఒంటరిగా స్విమ్ చేయకూడదు.
5. పూల్ చుట్టూ పరుగులు, ఆటలు వద్దు. నీటిలో జారి పడే ప్రమాదం ఉంది.
6. పూల్ పరిసరాల్లో సీసీ కెమెరాలు, సరైన లైటింగ్ ఉండేలా చూడాలి.
7. లోతును సూచించే మార్కింగ్‌లు స్పష్టంగా ఉండాలి.
8. ఫ్లోట్స్, రాప్స్, రైలింగ్స్ అందుబాటులో ఉంచాలి.
9. చిన్నపిల్లల కోసం తక్కువ లోతు ప్రాంతాలు ఉండేలా ఏర్పాటు చేయాలి.
10. పూల్‌లో ఎల్లప్పుడూ లైఫ్ గార్డ్ లేదా సూపర్వైజర్ ఉండాలి.

అత్యవసర సౌకర్యాలు:

1. ముందస్తుగా ఫస్ట్ ఎయిడ్ కిట్ సిద్ధంగా ఉంచుకోవాలి.
2. లైఫ్ జాకెట్లు, గాలి నింపిన రింగులు, ఇతర రక్షణ పరికరాలు సిద్ధంగా ఉంచుకోవడం మంచిది.
3. ఎమర్జెన్సీ ఎగ్జిట్, సేఫ్టీ రూట్స్ స్పష్టంగా ఉండేలా చూడాలి.

నీటి నాణ్యత, నిర్వహణ:
1. నీరు శుభ్రంగా ఉందో, క్లోరిన్ తగినంత ఉందో ఎల్లప్పుడూ తనిఖీ చేయాలి.
2. నీరు మురికిగా లేదా పరిశుభ్రత లేకపోతే వినియోగం నిలిపివేయాలి.
3. భద్రతా లోపాలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే యాజమాన్యం చర్యలు తీసుకోవాలి.
4. పూల్ నిర్వహణ నిబంధనలను నివాసితులు , అతిథులకు తెలియజేయాలి.

​జాగ్రత్తలు తప్పనిసరి:

1. పూల్ లోకి జంప్ చేసేముందు లోతు, పరిస్థితిని పరిశీలించాలి.
2. ప్రవేశించే ముందు షవర్ చేయాలి; పూర్తి చేసిన తర్వాత స్నానం చేయాలి.
3. ప్రత్యేక స్విమ్మింగ్ దుస్తులు ధరించాలి.
4. కళ్ళ రక్షణ కోసం గాగుల్స్ ధరించాలి, క్లోరిన్ వల్ల ఇబ్బంది తలెత్తకుండా.
5. వేగంగా : స్విమ్ చేయకూడదు; ప్రతి 15 నిమిషాలకు విరామం తీసుకోవాలి.
6. వాతావరణ పరిస్థితులను పరిశీలించాలి; వర్షం లేదా చలి ఎక్కువ సమయంలో ఈత వద్దు. కొత్తగా ఈత నేర్చుకునే వారు ఎల్లప్పుడూ నిపుణుల పర్యవేక్షణలో ఉండాలి.
7. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలను వెంటనే పోలీస్/సిబ్బందికి తెలియజేయాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Apartment swimming pool negligence
  • Child drowning incidents Hyderabad
  • Child safety tips swimming pool
  • Cyberabad Police swimming pool safety
  • KPHB child drowning case

తాజావార్తలు

  • Off The Record : ఆత్మకూరులో మంత్రి అనుచరుల అడ్డగోలు దోపిడీ..?

  • Lifetime Achievement Award: ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ కు అరుదైన గౌరవం..

  • Monalisa- Farman Khan: మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ బ్యాక్‌ గ్రౌండ్ ఇదే..

  • CM Revanth Reddy: అల్లు అర్జున్ హాలీవుడ్‌లో కూడా రాణించాలి.. సీఎం రేవంత్ రెడ్డి..

  • Off The Record : బుగ్గన అనుచరులు భూ కబ్జా చేశారా..?

ట్రెండింగ్‌

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions