Cyberabad Police: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు స్విమ్మింగ్ పూల్‌లలో పడి ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న విషాదకర ఘటనలు కలచివేస్తున్నాయని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. చిన్న పాటి నిర్లక్ష్యం కారణంగా కన్నవారికి కడుపు కొత్త మిగిలిస్తున్నారన్నారు.. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులకు కీలక సూచనలు చేస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు.