Site icon NTV Telugu

Cyberabad Commissionerate: సైబరాబాద్ కమిషనరేట్‌కు 23 ఏళ్లు.. ఛాలెంజింగ్‌గా మారిన ఆ కేసులు..

Cyberabad Commissionerate

Cyberabad Commissionerate

Cyberabad Commissionerate: సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పడి నేటికి 23 ఏళ్ళు పూర్తైంది. 23 ఏళ్లు పూర్తి కావడంతో సైబరాబాద్ కమిషనరేట్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సైబరాబాద్ సీపీ రమేశ్‌రెడ్డి కమిషనరేట్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. సైబరాబాద్ కమిషనరేట్ 24వ ఏడాదిలోకి ప్రవేశించడం సంతోషంగా ఉందన్నారు. రోజురోజుకు సైబర్ నేరాలు సంఖ్య పెరుగుతున్నాయని.. సైబర్ క్రైమ్స్ ప్రస్తుత రోజుల్లో ఛాలెంజ్ గా మారాయన్నారు. ఇంటర్నేషనల్ డ్రగ్స్ ముఠాలు సమాజ అభివృద్ధికి అడ్డంకిగా మారాయని తెలిపారు. దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా సైబరాబాద్ కమిషనరేట్‌కు మంచి పేరు వచ్చిందని గుర్తు చేశారు. ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయని.. యుద్ధంలో చనిపోయే వారి సంఖ్య కన్నా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా మారిందన్నారు.

READ MORE: Turkey Video: టర్కీ పార్లమెంట్‌లో ఫైటింగ్.. కొట్టుకున్న అధికార-విపక్ష ఎంపీలు

“నగరంలో శాంతిభద్రతలు కాపాడటంలో సైబరాబాద్ కమిషనరేట్ కీలకంగా మారింది.. లక్షల మంది నగరానికి వలస వచ్చి జీవనం సాగిస్తున్నారు.. వలస వచ్చిన వారికి నిరంతరం రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు సిబ్బంది పై ఉంది.. ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్ వంటి ప్రముఖ సంస్థలు ఎక్కువగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ఉన్నాయి.. భద్రతను కాపాడే విధంగా పోలీసులు వ్యవహరించాలి.. నా కంటే ముందు ఇక్కడ 9 మంది కమీషనర్లుగా పనిచేశారు.. త్వరలోనే వారందరినీ కలిసి కమిషనరేట్ అభివృద్ధికి సూచనలు తీసుకుంటాం..” అని సీపీ రమేశ్‌రెడ్డి వెల్లడించారు.

READ MORE: Babar Azam: ఇలా ఉన్నారేంట్రా? బాబర్‌పై లైవ్ టీవీలో పందేలు!.. ఘోరంగా అవమానించిన పాక్ మాజీ ప్లేయర్స్..

Exit mobile version