NTV Telugu Site icon

Cyber Crime: చికెన్ ఆర్డరిచ్చి.. అకౌంట్లో డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లు

Chicken Shop

Chicken Shop

సైబర్ నేరస్తులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు.. డబ్బులు కొట్టేసేందుకు ఏ మార్గాన్ని వదలట్లేదు.. ఇప్పటివరకు అనేక రకాలుగా మోసాలకు దిగిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్న సామెతలా.. రూపాయి ఉంటే రూపాయి కూడా వదలకుండా లాగేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి.. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లోని ఓ చికెన్ దుకాణానికి ఓ వ్యక్తి ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చి.. ఆ షాప్ యజమాని అకౌంట్లోని డబ్బులన్నీ కొట్టేశాడు.

Read Also: Gold Price Today : మగువలకు గుడ్ న్యూస్.. నేడు బంగారం, వెండి ధరలు ఎంతంటే?

అయితే, ఓ వ్యక్తి తనకు 15 కిలోల చికెన్ కావాలని ఫోన్ చేసినట్లు షాప్ యాజమని చెప్పాడు. చికెన్ కొట్టి రెడీ చేసిన తర్వాత ఫోన్ చేయాలని చెప్పినట్లు అతడు పేర్కొన్నాడు. దీంతో.. ఆ దుకాణా యజమాని భలే మంచి బేరం దొరికిందని సంతోషంతో.. ఆర్డర్ రెడీ చేసి.. వచ్చి తీసుకెళ్లాలని ఆర్డర్ ఇచ్చిన నెంబర్‌కు కాల్ చేశాడు. అయితే.. ఆ నెంబర్‌కు సదరు సైబర్ నేరగాడు రూ.5 సెండ్ చేశాడు.. బై మిస్టేక్‌లో నీ ఫోన్ కు ఐదు రూపాయలు వచ్చాయి.. వాటిని తిరిగి పంపించాలని చెప్పాడు.. అతని మాటలు నమ్మిన చికెన్ షాప్ యాజమాని ఆ ఐదు రూపాయలు రిఫండ్ చేశాడు.

Read Also: Cylinder Blast: దోమలగూడలో గ్యాస్ లీక్ ఘటనలో మరొకరు మృతి..

దీంతో.. తనకు డబ్బులు పంపించిన తర్వాత ఫోన్‌కు ఓ కోడ్ వస్తుందని సైబర్ నెరగాడు చెప్పాడు.. ఆ కోడ్ తనకు చెప్పాలని సూచించగా.. ఆ అమాయకపు యజమాని సైబర్ నేరగాడు చెప్పినట్లుగానే కోడ్ చెప్పాడు. అంతే.. క్షణాల్లోనే చికెన్ షాప్ యాజమాని అకౌంట్‌లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయినట్టు మెసేజ్ వచ్చింది. ఇక, వెంటనే ఆ షాప్ యజమాని అకౌంట్‌లో రూ.9,489 ఉండగా.. మొత్తం కాజేశాడు ఆ సైబర్ నేరగాడు. అప్పుడు.. మోసపోయినట్లు గమనించిన చికెన్ షాప్ యజమాని 1930 నెంబర్‌కు ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.