Cyber Crime: టాస్క్ పేరిట.. జగిత్యాల యువకుడికి 3.17 లక్షలు టోకరా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagtial Young Man Venkat Sai Was Cheated by Cyber Criminals: సైబర్ కేటుగాళ్ల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. నిత్యం ఓ అడుగు అడ్వాన్స్‌గా ఉంటూ.. అందిన కాడికి దోచుకుంటున్నారు. ముఖ్యంగా అమాయకులకు ఎరవేసి.. వారి కష్టార్జితాన్ని కొల్లగొడుతున్నారు. సైబర్ నేరగాళ్ల తెలివికి.. అమాయకులు మాత్రమే కాదు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కూడా మోసపోతున్నారు. తాజాగా మరో సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. టాస్క్ పేరిట ఓ యువకుడికి ఏకంగా రూ. 3.17 లక్షలు టోకరా పెట్టారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని వాణినగర్‌కు చెందిన వెంకట్ సాయి అనే యువకుడికి గత నెల 23న వాట్సాప్‌కు సైబర్ కేటుగాళ్ల నుంచి ఓ మిస్డ్ కాల్ వచ్చింది. వెంకట్ సాయి తిరిగి కాల్ చేయగా.. సైబర్ కేటుగాళ్లు మాట్లాడారు. వాట్సాప్ ద్వారా టాస్క్ చేస్తే.. భారీ మొత్తంలో డబ్బులు వస్తాయని అతడిని నమ్మించారు. అందుకు ముందుగా కాస్త డబ్బు చెల్లించాలని చెప్పారు. సైబర్ కేటుగాళ్ల మాయమాటలు నమ్మిన వెంకట్ సాయి.. ముందుగా కొంత డబ్బు పంపాడు.
Also Read
- Arshdeep Singh-Samreen Kaur: హార్ట్, లాక్ ఎమోజీలే చెప్పేస్తున్నాయా..? అర్ష్‌దీప్-సమ్రీన్ రిలేషన్‌పై మళ్లీ చర్చ..!
- Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం.. ఎయిర్‌పోర్టులో ప్రధాన నిందితుడు అరెస్ట్..
- Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
- Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్‌కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
Also Read: Gaddam Vinod: వాట్సాప్ గ్రూప్‌లలో పోర్న్ వీడియోలు.. స్పందించిన కాంగ్రెస్ నేత!
వెంకట్ సాయి దశలవారీగా 3.17 లక్షలు సైబర్ నేరగాళ్ల ఖాతాలో జమ చేశాడు. అనంతరం సైబర్ నేరగాళ్ల నుంచి ఎలాంటి స్పందన లేదు. తాను మోసపోయానని గ్రహించిన వెంకట్ సాయి.. పోలీసులను ఆశ్రయించాడు. జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్‌లో యువకుడు పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Fauzi premieres : వరల్డ్ వైడ్‌గా ఒకరోజు ముందుగానే ‘ఫౌజీ’ ప్రీమియర్స్.. కన్ఫామ్ చేసిన మైత్రి రవి
-
Suriya-Jyothika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా వస్తారా?.. వైరల్ అవుతున్న సూర్య, జ్యోతిక ఫోటోషూట్!
-
Arshdeep Singh-Samreen Kaur: హార్ట్, లాక్ ఎమోజీలే చెప్పేస్తున్నాయా..? అర్ష్‌దీప్-సమ్రీన్ రిలేషన్‌పై మళ్లీ చర్చ..!
-
Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం.. ఎయిర్‌పోర్టులో ప్రధాన నిందితుడు అరెస్ట్..
-
Pooja Hegde : 18 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఇలా ఉందేంటి
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!