Site icon NTV Telugu

Vamshi Chand Reddy : నీళ్లను ఆంధ్రోళ్లు దోచుకెళ్తుంటే… చేతకాక చూస్తూ ఉండిపోయారు

Vamshi Chand Reddy

Vamshi Chand Reddy

కన్నీళ్ళ గాథలు వినిపిస్తున్న పాలమూరు ప్రజల తరుపున మాట్లాడుతున్నానని, నీళ్ళు, నిధులు, నియామకాల పేరిట ఇంట్లో వాళ్ళందరూ ఉద్యోగాలు పొందిం కేసీఆర్‌ కుటుంబమని సీడబ్ల్యూసీ మెంబర్ వంశీ చంద్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీళ్లను ఆంధ్రోళ్లు దోచుకువెళ్తుంటే… చేతకాక చూస్తూ ఉండిపోయారని ఆయన మండిపడ్డారు. కమిషన్ లు తీసుకొని కాళేశ్వరం కట్టి, కాంట్రాక్టులు ఆంధ్రోళ్లు కట్టబెట్టారని, నియామకాలు పాలమూరు జిల్లా ప్రజలకు రాలేదు కానీ కేసిఆర్ కుటుంబ సభ్యులకు వచ్చాయన్నారు వంశీ చంద్‌ రెడ్డి. పాలమూరు, తెలంగాణ ప్రజలను మోసం చేసిన కేసిఆర్.. పాలమూరు ప్రజలకు ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వలేని కేసీఆర్ కి పాపం తగులుతుందని ఆయన మండిపడ్డారు. కేసీఆర్‌కి పాలమూరు ప్రజల తరుపున బహిరంగ లేఖ రాస్తున్నానని, గత పదేళ్ళ ఒక్క చుక్క నీళ్ళు ఇవ్వకుండా.. పదేళ్ల నిర్లక్ష్యం తుడిచి పెట్టీ రేవంత్ రెడ్డి పాలన చేస్తుంటే… బీఆర్ఎస్ కుట్రలు చేస్తూ.. విమర్శలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా.. ‘మీ ధనదహం వల్ల పాలమూరుకు ఒక్క చుక్క నీరు ఇవ్వలేదు. పాలమూరుకు ఏ ఎకరానికి నీరు వచ్చిన వైఎస్ఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల వల్లనే.. కేసిఆర్ కి ఛాలెంజ్ చేస్తున్న.. పాలమూరు ప్రాజెక్టు 90శాతం పనులు చేశాం అని చెబుతున్న మీరు.. ఆంధ్రోళ్లు సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా 11 టీఎంసీ లు దోచుకు వెళ్తుంటే.. అసమర్ధతతో చూస్తూ ఉండిపోయారు. 299 టీఎంసీ లు కూడా ఉపయోగించుకోలేనీ అసమర్థ సీఎం కేసిఆర్ యే. కేసిఆర్ చేతకాని తనం వల్ల 299 వచ్చాయి.. కానీ రేవంత్ రెడ్డి లాంటి దమ్మున్న సీఎం ఉంటే 575 టీఎంసీలు తెలంగాణ వాటా గా వచ్చేవి. ఎవరు కరెక్ట్ అనేది ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం.. రా. మీరు చెప్పింది నిజం అయితే..రా. కేసీఆర్ పాలమూరు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు.. అన్యాయం చేశారు. దమ్ముంటే..కేసిఆర్ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చెయ్యి. ఆ ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారు ఎవరు చెప్పేది నిజాం అనేది. ఇది కౌంటర్ పాలిటిక్స్ కాదు. బీ ఆర్ ఎస్ బండారం బయట పెట్టాలని సందర్శన పెట్టుకున్నాం. రేపు మెడిగడ్డకు వెళ్ళే వాళ్ళు చెప్పాలి లక్ష కోట్ల అవినీతి గురించి చెప్పాలి. కేసీఆర్ ఏ మేడిగడ్డ ను బొందల గడ్డ అన్నారు. మళ్ళీ ఆ బోందల గడ్డ కు ఎందుకు వెళ్తున్నట్లు చెప్పాలి. సంగమేశ్వర ప్రాజెక్టు లిఫ్ట్ కెనాల్ ద్వారా ఇరువై వేల ఎకరాలకు నీరు అందిస్తాం. నిన్ననే ఆ ప్రాంత ప్రజలకు నష్టపరిహారం 11 కోట్లు విడుదల చేశాం. రేపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శన కి వెళ్తాము. పాలమూరు ఎంత పూర్తి చేశారో చూపిస్తామన్నారు వంశీచంద్‌ రెడ్డి.

Exit mobile version