Site icon NTV Telugu

CV Anand: హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్కు అంతర్జాతీయ అవార్డు.. ఏకంగా 138 దేశాలు పోటీ!

Cv Anad

Cv Anad

హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్కు అంతర్జాతీయ అవార్డు లభించింది.. సీవీ ఆనంద్కు ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కొటిక్స్ అవార్డు ప్రదానం చేయనుంది.. డ్రగ్స్ కట్టడిలో కీలక పాత్ర పోషించినందుకు సీవీ ఆనంద్కు అవార్డు దక్కింది.. దుబాయ్లో జరగబోయే అంతర్జాతీయ పోలీస్ సమ్మిట్లో అవార్డు ప్రదానం చేస్తారు.. ఈ ముఖ్యమైన వేదిక అయిన వరల్డ్ పోలీస్ సమ్మిట్-2025 కు 138 దేశాల నుంచి ప్రముఖ పోలీసు అధికారులు ఒకేచోట సమావేశమవుతున్నారు. ఈ వరల్డ్ పోలీస్ సమ్మిట్ ఎఫ్‌బీఐ, ఎన్‌వైపీడీ, ఎల్‌ఏపీడీ, మెట్రోపాలిటన్ పోలీస్ (యూకే), ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్, జర్మన్ పోలీస్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థల భాగస్వామ్యంతో వారి వ్యూహాత్మక సహకారాన్ని, ఉత్తమ పద్ధతులను అంది పుచ్చుకోవడానికి తోడ్పడుతుంది. ఆధునిక పోలీసుల సవాళ్లను పరిష్కరించడానికి తగిన పరిష్కారాలు, ఆలోచనలు ఈ వరల్డ్ పోలీస్ సమ్మిట్ ద్వారా ఉపయోగపడుతుంది.

READ MORE: Off The Record: బలమైన కమ్మ నేత కోసం బీఆర్ఎస్ చూస్తోందా?

కాగా.. ఈ సంవత్సరం అవార్డుల కోసం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పోటీ నెలకొంది. వివిధ ఖండాల్లోని పోలీసు విభాగాల నుంచి వచ్చిన దరఖాస్తులను నైపుణ్యం కలిగిన నిపుణులు, దుబాయ్ పోలీసులతో కూడిన న్యాయమూర్తుల బృందం రెండు దశల్లో క్షుణ్ణంగా పరిశీలించింది. మాదక ద్రవ్యాల సరఫరాపై ప్రభావం, మాదకద్రవ్యాల వినియోగం తగ్గడం, సమాజంతో కలిసి పనిచేయడం, వివిధ సంస్థల మధ్య సహకారం వంటి అంశాలను మూల్యాంకనంలో పరిగణించారు. మొదటి దశలో ప్రతి న్యాయమూర్తి దరఖాస్తులను సమీక్షించి, మార్కులు వేశారు.

READ MORE: India Pakistan: ‘‘నోటామ్’’ జారీ చేసిన భారత్.. పాక్ సరిహద్దుల్లో ఎయిర్‌ఫోర్స్ యుద్ధ విన్యాసాలు..

ప్రతి విభాగంలో మొదటి ఐదు దరఖాస్తులను ఎంపిక చేశారు. రెండవ దశలో, ఎంపికైన వారిని వారి కార్యక్రమాలు, అమలు చర్యలను సమర్థించడానికి ఒక వర్చువల్ సమావేశానికి ఆహ్వానించారు. ఈ వర్చువల్ సమావేశంలో .సివి ఆనంద్ ఐసీఎస్ డీజీ సీపీ హైదరాబాదు సమగ్రమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. అమలు చర్యలను కూడా సవివరంగా వారికి వివరించారు. ఎంత పోటీ ఉన్నప్పటికీ సీవీ ఆనంద్ మొదటి స్థానంలో నిలిచారు. ఇది తెలంగాణ పోలీసులకు మాత్రమే కాకుండా, దేశంలోని సామూహిక మాదక ద్రవ్యాల నిరోధక ప్రయత్నాలకు కూడా ఒక గొప్ప విజయం.

Exit mobile version