కూరల్లో కరివేపాకు వస్తే తీసి పక్కన పడేస్తారు.. కానీ కరివేపాకు గురించి తెలిస్తే పచ్చిగానే తినేస్తారు.. కరివేపాకు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువే.. కొలెస్ట్రాల్ ను కరిగించడంలో సహాయ పడుతుంది.. ఇంకా జుట్టు సమస్యలను దూరం చేస్తుంది. ఈ కరివేపాకును ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఇక కరివేపాకును రోజూ తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ పూర్తిగా తగ్గిపోతాయని, రక్తనాళాల్లో ఉండే కొవ్వు మొత్తం కరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.. అయితే రోజుకు 8 లేదా 10 ఆకులను తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయి.. పరగడుపునే 5 కరివేపాకులను తీసుకుని బాగా కడిగి వాటిని అలాగే నమిలి మింగాలి. లేదంటే వాటి నుంచి రసం తీసి కూడా తాగవచ్చు.. కరివేపాకును ఎలా తీసుకున్న ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగానే ఉన్నాయి.. ఒంట్లో కొవ్వు మొత్తం కరిగిపోతుంది.
కరివేపాకును తినడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. ముఖ్యంగా గ్యాస్ తగ్గుతుంది. కడుపులో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.. జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుంటుంది. రక్త హీనత సమస్య పూర్తిగా తగ్గుతుంది.. అలాగే మహిళలకు రక్త హీనత సమస్యలు దూరం అవుతాయి.. నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి.. కరివేపాకుల్లో ఉండే ఐరన్ రక్తాన్ని వృద్ధి చేస్తుంది. రక్తం అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.. ఇంకా ఎన్నో సమస్యలు దూరం అవుతాయి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.