NTV Telugu Site icon

IPL 2024 Final: ట్రోఫీతో కమిన్స్, శ్రేయాస్ ఫొటో షూట్.. పడవ, ఆటోలో మాములుగా లేదుగా

Photo Shoot

Photo Shoot

ఆదివారం (రేపు) ఐపీఎల్ 2024 ఫైనల్ సమరం జరగబోతుంది. శుక్రవారం రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచి ఫైనల్లోకి దూసుకొచ్చింది. ఇక.. క్వాలిఫైయర్-1 మ్యాచ్లో ఇదే సన్ రైజర్స్పై కోల్కతా నైట్రైడర్స్ గెలిచి ఫైనల్లోకి వెళ్లింది. ఈ క్రమంలో.. రేపు (మే 26) జరుగనుంది. ఈ తరుణంలో ఈ తుదిపోరులో పోటీ పడే సన్‍రైజర్స్ హైదరాబాద్, కోల్‍కతా నైట్‍రైడర్స్ కెప్టెన్లు ఐపీఎల్ ట్రోఫీతో ఫొటో షూట్ చేశారు. చెన్నైలోని మెరీనా బీచ్‍లో ఇద్దరూ కెప్టెన్లు ఐపీఎల్ ట్రోఫీ పట్టుకుని కెమెరాలకు ఫోజులు ఇచ్చారు. ఇదిలా ఉంటే.. మరో ఫోటోలో చెపాక్ స్టేడియం వద్ద కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆటోలో కూర్చొని ఉంటే.. ఎస్ఆర్‌హెచ్ సారథి కమిన్స్ ఆటోను ఆనుకుని నిలబడ్డాడు.

Read Also: Gujarat: గుజరాత్‌లో ఘోర ప్రమాదం.. 17 మంది మృతి

కాగా.. ఐపీఎల్ 2024 సీజన్లో మొదటి నుంచి ఇరుజట్లు మంచి ప్రదర్శన కనబరుస్తున్నాయి. సీజన్ మొదటి నుంచి పాయింట్ల పట్టికలో కోల్ కతా టాప్ 4లో కొనసాగింది. అనుహ్యంగా హైదరాబాద్ మాత్రం పట్టికలో మధ్యలో నుంచి టాప్ 4 లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ప్లే ఆఫ్స్కు క్వాలిఫై ఇప్పుడు ఫైనల్ లోకి అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే.. రేపటి మ్యాచ్లో విజయావకాశాలు కేకేఆర్కు ఎక్కువగా ఉన్నట్లు అంచనాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. క్వాలిఫైయర్- 1 మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ పై కోల్కతా గెలిచింది. ఆ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్లో సన్ రైజర్స్ ఆటగాళ్లు విఫలమయ్యారు. ఇక.. రేపటి మ్యాచ్ లో హైదరాబాద్ ఆటగాళ్లు ఎలా ఆడుతారన్నదే చూడాలి. అయితే.. రేపటి ఎస్ఆర్‌హెచ్, కేకేఆర్ మధ్య ఫైనల్ సమరం కోసం క్రికెట్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Also: UP FIRE: యూపీలో ఘోరం.. కారు దగ్ధమై దంపతులు సజీవదహనం

Show comments