Gujarat: గుజరాత్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 22 మంది సజీవదహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాజ్‌కోట్‌లోని గేమింగ్ జోన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 22 మంది సజీవదహనం అయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది. ఈ ప్రమాదంపై కేంద్రం పెద్దలు విచారం వ్యక్తం చేశారు. గేమింగ్ జోన్‌లో తక్షణమే రెస్కూ, రిలీఫ్ కార్యకలాపాలు నిర్వహించాలని నగర పాలక సంస్థకు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆదేశించారు.
శనివారం సాయంత్రం గేమింగ్ జోన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో చిన్నారులు సహా 22 మంది మరణించారని అధికారులు తెలిపారు. ఇక మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. గేమింగ్ జోన్‌లోని తాత్కాలిక నిర్మాణంలో ఈ ప్రమాదం సంభవించింది. వేసవి సెలవులు కావడంతో పెద్ద సంఖ్యలో చిన్నారులు తరలివచ్చారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..

గేమింగ్ జోన్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అగ్నిప్రమాదానికి సంబంధించిన భయంకరమైన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొత్తం 60 గేమింగ్ జోన్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 20 మందిని రక్షించారు. మంటలకు కారణాలేంటో ఇంకా తెలియలేదు. గేమింగ్ జోన్ పూర్తిగా చెక్‌తో నిర్మించడం వల్ల ప్రమాదం తీవ్రంగా జరిగింది. ఇక బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ వారి ఆచూకీ కోసం తెలియక హడలిపోతున్నారు. ఫోన్లు చేసుకుంటూ సమాచారాలు తెలుసుకుంటున్నారు. సంఘటనాస్థలికి పోలీసులు, అధికారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించింది.
#WATCH | Gujarat: A massive fire breaks out at the TRP game zone in Rajkot. Fire tenders on the spot. Further details awaited. pic.twitter.com/f4AJq8jzxX
— ANI (@ANI) May 25, 2024
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!