Rajanna Sirisilla: గంజాయి కొన్న, అమ్మినా పోలీసులకు తెలిసిందంటే అంతే.. తీసుకుపోయి బొక్కలో వేసేస్తారు. గంజాయి నిర్మూలన కోసం పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కొందరు గంజాయి సాగుదారులు మాత్రం చేనులో, ఎవరికి తెలియని స్థలాల్లో పెంచుతుంటారు. కానీ ఓ వ్యక్తి ఏకంగా ఇంట్లోనే పెంచుతూ పోలీసులకే షాక్ ఇచ్చాడు. అది కూడా ఈ ఏడాదో, గతేడాదో కాదు.. దాదాపు 48 సంవత్సరాలుగా గంజాయి సాగు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..
Read Also: Mobile Usage: మొబైళ్లకు అతుక్కుపోతున్న పిల్లలు.. రోజుకు 4 గంటలు సెల్‌ఫోన్ లోనే..
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గంజాయి చెట్ల పెంపకం కలకలం రేపుతుంది. తంగళ్ళపల్లి మండల కేంద్రం ఇందిరా నగర్ కాలనీలో పోలీసులు భారీగా గంజాయి చెట్లు స్వాధీనం చేసుకున్నారు. మొహమ్మద్ హైదర్ (64) అనే వ్యక్తి తన ఇంటి ఆవరణలోనే 31 గంజాయి చెట్లను పెంచుతున్నట్లు పోలీసులు కనుగొన్నారు. దాంతో అక్కడికి వెళ్లి పరిశీలించారు. గంజాయి మొక్కల పెంపకంపై పోలీసులు ఆరా తీయగా.. వాటిని 48 సంవత్సరాలుగా సాగు చేస్తున్నట్లు హైదర్ తెలిపారు. అంతేకాకుండా వాటిని పెంచి, గంజాయి అమ్ముతూ, సేవిస్తాడని సీఐ తెలిపాడు. దీంతో పోలీసులు హైదర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read Also: Vishal: లంచగొండి సెన్సార్ అధికారి బాగోతం బట్టబయలు చేసిన విశాల్