CtrlS AI Data Center: తెలంగాణలో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్ క్లస్టర్‌ను నెలకొల్పేందుకు కంట్రోల్ఎస్ (CtrlS) డేటా సెంటర్స్ లిమిటెడ్ కంపెనీ అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేసింది. ఈ ఒప్పందం ప్రస్తుతం దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా కుదిరింది. ఈ ప్రాజెక్టుకు కంట్రోల్ఎస్ సంస్థ రూ. 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 400 మెగా వాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్‌ను తెలంగాణలో నెలకొల్పే ప్రణాళికను రూపొందించింది.…