Suresh Raina: నన్నడిగే సీఎస్కే జట్టులోంచి తీసేశాడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్ కింగ్స్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. మిస్టర్ ఐపీఎల్‌గా పేరు పొందిన సురేశ్ రైనాను రాబిన్ ఉతప్ప కోసం తప్పించింది. సీజన్‌కు ముందే రాజస్థాన్ రాయల్స్ నుంచి అతడిని కొనుగోలు చేసిన సీఎస్కే యాజమాన్యం.. ఢిల్లీ మ్యాచ్ లో అతన్ని తుది జట్టులోకి తీసుకుంది. దీంతో ఈ మ్యాచ్ తర్వాత రైనాను టీమ్ లోకి తీసుకోలేదు.. టాస్‌కు ముందే అతడు గాయపడ్డాడని ధోని చెప్పడం గమనార్హం.
Also Read: CM KCR: ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు ఎత్తేయండి.. డీజీపీకి కేసీఆర్ ఆదేశాలు
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
రాబిన్ ఉతప్పతో జరిగిన చర్చలో సురేశ్ రైనా ఈ విషయాలను తెలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచులో రైట్ హ్యాండర్ బ్యాటర్‌ను తీసుకోవడం వ్యూహాత్మక అంశమని అతడు వివరించాడు. అందుకోసమే ఎంఎస్ ధోనీ తనని ముందుగా సంప్రదించాడని సురేశ్ రైనా తెలిపాడు. ఢిల్లీ మ్యాచుకు ముందు నేను, ఎంఎస్ ధోనీ మాట్లాడుకున్నాం.. రాబిన్ ఉతప్పను ప్రయత్నించడం మంచిదని నేను సలహా ఇచ్చాను అతడు చెప్పాడు.
Also Read: Stunning Catch: ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్న బ్రాడ్ కర్రీ
ఉతప్పను ఆడించేందుకు ఎంఎస్ ధోని నా పర్మిషన్ తీసుకున్నాడు.. నన్ను నమ్ము! ఉతప్ప మనల్ని ఫైనల్‌కు తీసుకెళ్తాడని నేను నచ్చచెప్పాను’ అని రైనా వివరించాడు. నేను లేని తుది జట్టును తీసుకోవడం ధోనీ డిక్షనరీలోనే లేదు.. 2008 నుంచి మనిద్దరం కలిసి ఆడుతున్నామని ధోని చెప్పాడు.. తాను ఈ సీజన్ ఎలాగైనా గెలవాలని పేర్కొన్నాడు అని రైనా అన్నాడు. దాంతో రాబిన్‌ను మూడో స్థానంలో ఆడించాలని, ఫైనల్ వరకు అలాగే కొనసాగించాలని సూచించాను.. నువ్వు గెలిస్తే సీఎస్కే గెలిచినట్టే.. ఎవరు ఆడినా ఒక్కటే.. రాబిన్, రైనాకు తేడా లేదని చెప్పా అని సురేశ్ రైనా పేర్కొన్నాడు.
Also Read: Kedarnath Disaster: కేదార్‌నాథ్ దుర్ఘటనకు పదేళ్లు.. ఇప్పటికీ మర్చిపోలేకపోతున్న ప్రజలు
ఐపీఎల్ 2021లో రాబిన్ ఉతప్ప 4 మ్యాచులు ఆడి 115 పరుగులు చేశాడు. 136.90 స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు. ఈ సీజన్ ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 27 పరుగుల తేడాతో ఓడించింది. కాగా తర్వాతి సీజన్లోనే ధోని సేన చిత్తుగా ఓడింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. మళ్లీ 2023లో టైటిల్ గెలిచి ఔరా అనిపించింది. సీనియర్ బౌలర్లు లేనప్పటికీ తన పదునైన వ్యూహాలతో మహీ జట్టును విజయ తీరాలకు చేర్చాడు.
- Tags
- CSK
- dhoni
- ipl2021
- Raina
- Robin Uthappa
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!