Stunning Catch: ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్న బ్రాడ్ కర్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఆల్‌టైమ్ బెస్ట్ క్యాచ్ నమోదైంది. ససెక్స్ క్రికెటర్ బ్రాడ్ కర్రీ ఓ స్టన్నింగ్ ఫీట్ చేసి అందరి చేత ఔరా అనిపించుకుంటున్నాడు. టీ20 క్రికెట్ లో ఈ అద్భుతమై ఘటన చోటుచేసుకుంది. అసలు విషయంలోకి వెళితే.. లీగ్‌లో భాగంగా హంప్‌షైర్, ససెక్స్ మధ్య మ్యాచ్ జరిగింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హంప్‌షైర్ విజయానికి 11 బంతుల్లో 23 పరుగులు చేయాల్సి ఉండగా.. అప్పటికే క్రీజులో ఆల్‌రౌండర్ బెన్నీ హావెల్ 14 బంతుల్లోనే 25 పరుగులతో దాటిగా ఆడుతున్నాడు.
Also Read: Kedarnath Disaster: కేదార్‌నాథ్ దుర్ఘటనకు పదేళ్లు.. ఇప్పటికీ మర్చిపోలేకపోతున్న ప్రజలు
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ఇక 19వ ఓవర్ టైమల్ మిల్స్ వేశాడు.. ఓవర్ రెండో బంతిని మిల్స్ ఫ్లాట్ డెలివరీ వేయగా.. క్రీజులో ఉన్న హావెల్ స్వీప్ షాట్ ఆడాడు.. బంతి గాల్లోకి లేచి నేరుగా స్టాండ్స్‌లో పడుతుంది అని అందరు అనుకున్నారు.. ఇక టార్గెట్ కూడా 10 బంతుల్లో 17 పరుగులే అని అందరు భావించారు. కానీ ఇక్కడే అసలు ఊహించని ట్విస్ట్ జరిగింది. బౌండరీ లైన్ దగ్గర ఉన్న బ్రాడ్ కర్రీ పరిగెత్తుకుంటూ వచ్చి శరీరాన్ని స్ట్రెచ్ చేస్తూ అమాంతం గాల్లోకి లేచి ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఈ అద్భుత దృశ్యాన్ని గ్రౌండ్ లోని ఆటగాళ్లు సహా ప్రేక్షకులు నోరెళ్లబెట్టి చూశారు.
Also Read: Marble Palace: రూ.1,600 కోట్లతో మార్బుల్ ప్యాలెస్.. అమ్మకానికి, అద్దెకు అందుబాటులో
బ్రాడ్ కర్రీ అందుకున్న క్యాచ్ క్రికెట్ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాచ్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు అని అంటున్నారు. క్యాచ్‌తోనే కాదు బౌలింగ్‌తోనూ మెరిసిన బ్రాడ్ కర్రీ 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి కీలకమైన మూడు వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కర్నీ స్టన్నింగ్ క్యాచ్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
STOP WHAT YOU ARE DOING
BRAD CURRIE HAS JUST TAKEN THE BEST CATCH OF ALL TIME 🤯#Blast23 pic.twitter.com/9tQTYmWxWI
— Vitality Blast (@VitalityBlast) June 16, 2023
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!