CSK vs PBKS: నేడు చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తమ ఇన్నింగ్స్‌ను 19.2 ఓవర్లలో 190 పరుగులకు ముగించింది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ (PBKS) బౌలింగ్ ఎంచుకోగా, CSK మిక్స్‌డ్ బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచింది. ఇన్నింగ్స్ ప్రారంభంలో షైక్ రషీద్ (11), అయుష్ మ్హాత్రే (7) తొందరగా అవుట్ కావడంతో CSKకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయితే, ఆ తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన సామ్ కరన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 47 బంతుల్లో 9 ఫోర్లు మరియు 4 సిక్సర్లతో 88 పరుగులు చేసి సెంచరీ దగ్గర్లో వెనుతిరిగాడు కరన్. ఇక ఆ తర్వాత మిద్దెల ఆర్డర్ లో బ్రెవిస్ (32), జడేజా (17), ధోనీ (11) ఆడినా పెద్దగా నిలవలేకపోయారు. చివర్లో వికెట్లు వరుసగా పడిపోవడంతో 20 ఓవర్లు పూర్తి కాకముందే 19.2 ఓవర్లలో CSK ఆలౌటైంది. ముఖ్యంగా ధోనీ 275 స్ట్రైక్‌రేట్‌తో కేవలం 4 బంతుల్లో 11 పరుగులు చేసి అభిమానులను కొద్దిసేపు ఉత్సాహపరిచాడు.
Read Also: IBM: హీరోగా మారుతున్న మరో చైల్డ్ ఆర్టిస్ట్
ఇక బౌలింగ్ విభాగంలో పంజాబ్ కింగ్స్‌కి యుజ్వేంద్ర చాహల్ హ్యాట్రిక్ తో అదరగొట్టాడు. ఇనింగ్స్ 19 ఓవర్లో మొత్తం నాలుగు వికెట్లు తీసి చెన్నై స్పీడ్ కు బ్రేకులు వేసాడు. 19 ఓవర్ మొదటి బంతికి ధోని సిక్స్ కొట్టి అలరించగా, ఆ తరవాత బంతికే ధోని లాంగ్ ఆన్ లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక ఓవర్ 3వ బంతికి దీపక్ హుడా 2 పరుగులు సాధించగా.. ఆ తర్వాత బంతికి దీపక్ కూడా వెనుతిరిగాడు. ఆ తర్వాత 5వ బంతికి కంబోజ్, 6వ బంతికి నూర్ అహ్మద్ ను అవుట్ చేసి ఈ సీజన్ లో మొదటి హ్యాట్రిక్ ను సాధించాడు. చాహల్ మొత్తంగా 3 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసాడు. అలాగే అర్షదీప్ సింగ్, మార్కో జాన్సెన్ ఒక్కొక్కరు 2 వికెట్లు తీయగా.. ఒమర్‌జాయ్, హర్ప్రీత్ బ్రార్ ఒక్కో వికెట్ తీసారు. చివర్లో చెన్నై వికెట్లు త్వరగా కోల్పోయిన పంజాబ్ కింగ్స్ 191 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. చూడాలిమరి పంజాబ్ టార్గెట్ ను ఏ విధంగా ఛేదిస్తుందో.