Site icon NTV Telugu

CSK vs MI: రాణించిన జడ్డు భాయ్, దుబే… ముంబై టార్గెట్ ఎంతంటే?

Mi Csk

Mi Csk

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025)లో ఈరోజు ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. బరిలోకి దిగిన ధోనీ నాయకత్వంలోని సీఎస్‌కే 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. శివం దుబే(50), రవీంద్ర జడేజా(53) అదరగొట్టారు. 17 ఏళ్ల ఆయుష్ మాత్రే(32) సత్తా చూపాడు. షేక్ రషీద్(19) పర్వాలేదనిపించాడు.

READ MORE: Mohan Bhagwat: హిందువులకు ‘‘ఒకే ఆలయం, ఒకే బావి, ఒకే శ్మశాన వాటిక’’.. కుల భేదాలు తొలగాలి..

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. రచిన్ రవీంద్ర, షేక్ రషీద్ నెమ్మదిగా ఆరంభించారు. నాలుగో ఓవర్లోనే రచిన్ రవీంద్ర వికెట్ కోల్పోయాడు. అనంతరం 17 ఏళ్ల ఆయుష్ మాత్రే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మాత్రే 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేశాడు. అయితే.. 7వ ఓవర్లో దీపక్ చాహర్ చేతిలో ఔట్ అయ్యాడు. షేక్ రషీద్ కూడా తన తర్వాతి ఓవర్లోనే పెవిలియన్‌కు చేరాడు. క్రీజ్‌లోకి వచ్చిన శివం దుబే, రవీంద్ర జడేజా మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. దూబే కొన్ని అద్భుతమైన షాట్లు ఆడాడు. 32 బంతుల్లో 50 పరుగులు చేసి బుమ్రా చేతిలో ఔట్ అయ్యాడు.

READ MORE: Priyadarshi : ఆ సినిమా చేయడం చెత్త నిర్ణయం.. ప్రియదర్శి షాకింగ్ కామెంట్స్

అనంతరం బరిలోకి దిగిన ధోని 6 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. చిర్లో రవీంద్ర జడేజా(53) అద్భుతంగా రాణించాడు. అర్ధశతకం పూర్తి చేశాడు. దీంతో సీఎస్‌కే 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ముంబైకి 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కాగా.. బౌలర్లలో బూమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ సాంట్నర్, అశ్వనీ కుమార్, దీపక్ చాహర్ ఒక్కో వికెట్ తీశారు.

Exit mobile version