NTV Telugu Site icon

MS Dhoni: ఎంఎస్ ధోనీ ఇలా ఆడుతాడని అస్సలు ఊహించలేదు!

Ms Dhoni Shot

Ms Dhoni Shot

Stephen Fleming Praised MS Dhoni’s Innings in IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు అని సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. తీవ్రమైన గాయం నుంచి కోలుకుని వచ్చిన మహీ నుంచి ఇలాంటి ఆటతీరును ఊహించలేదన్నాడు. మునుపటి ధోనీని గుర్తుచేశాడని, మహీ షాట్లను తాను ఎంజాయ్ చేశానని ఫ్లెమింగ్‌ చెప్పుకొచ్చాడు. ఆదివారం విశాఖలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ.. ధనాధన్ షాట్లతో అలరించాడు. 16 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. ఇందుకు సంబందించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read: CSK Fan Died: ముంబై అభిమానుల దాడి.. సీఎస్‌కే అభిమాని మృతి!

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ అనంతరం సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ మాట్లాడుతూ… ‘ఎంఎస్ ధోనీ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. తీవ్రమైన గాయం నుంచి కోలుకుని వచ్చాక ఇలాంటి ఆట తీరును అతడి నుంచి నేను అస్సలు ఊహించలేదు. దూకుడైన బ్యాటింగ్‌తో ధోనీ అందరిని ఆకట్టుకున్నాడు. క్లిష్టమైన మ్యాచ్‌లోనూ మా జట్టుకు సానుకూల అంశం ఇదే. కేవలం ధోనీ వల్లే 20 పరుగుల తేడాతోనే మ్యాచ్‌ను కోల్పోయాం. పెద్ద టోర్నీలలో రన్‌రేట్‌ ఎంత ముఖ్యమో అతడికి తెలుసు. అందుకే ధోనీ దూకుడుగా ఆడాడు. ఈ ఓటమిపై మేం సమీక్షించుకుంటాం. ఛేదన ఆరంభంలోనే వెనుకబడ్డాం. బౌలింగ్‌లోనూ ఎక్కువగా పరుగులిచ్చాం. డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ దూకుడుగా ఆడారు. ఢిల్లీ భారీ స్కోరు చేయడానికి కారణం వారిద్దరే’ అని తెలిపాడు.

Show comments