NTV Telugu Site icon

MS Dhoni Batting: రెండు మ్యాచ్‌లలో బ్యాటింగ్‌కు రాని ఎంఎస్ ధోనీ.. కారణం ఏంటంటే?

Ms Dhoni Csk

Ms Dhoni Csk

CSK Coach Michael Hussey on MS Dhoni Did Not Bat in IPL 2024: ఐపీఎల్‌ 2024లో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ రెండు మ్యాచ్‌లు ఆడింది. బెంగళూరు, గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లలో చెన్నై అద్భుత విజయాలు అందుకుంది. బ్యాటింగ్‌, బౌలింగ్, ఫీల్డింగ్‌ విభాగాల్లో చెన్నై ప్లేయర్స్ అదరగొట్టారు. అయితే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌ను చూసే అవకాశం మాత్రం అభిమానులకు ఇంకా దక్కలేదు. గుజరాత్‌తో మ్యాచ్‌లో మహీ బ్యాటింగ్‌కు వస్తాడనుకుంటే.. అతడికంటే ముందు యువ ఆటగాడు సమీర్ రిజ్వీ, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాలు వచ్చారు. అప్పటివరకు డ్రెసింగ్ రూంలో సన్నద్ధమన మహీ.. బ్యాటింగ్‌కు రాకుండా అభిమానులను నిరాశపరిచాడు.

అవకాశం ఉన్నా ఎంఎస్ ధోనీ ఎందుకు బ్యాటింగ్‌కు రావడం లేదని అభిమానులు ఆలోచనలో పడ్డారు. మహీ బ్యాటింగ్‌కు రాకపోవడానికి కారణమేంటో చెన్నై కోచ్ మైక్‌ హస్సీ తెలిపాడు. ఇంపాక్ట్‌ రూల్‌ను సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతోనే ధోనీ బ్యాటింగ్‌కు రాలేకపోయాడు అని చెప్పాడు. ‘ఎంఎస్ ధోనీ మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. ఇంపాక్ట్‌ రూల్‌ను సద్వినియోగం చేసుకోవాలని మేం చూశాం. అందుకే ధోనీ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పు జరిగింది. మా ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ సూచనల మేరకే ఇలా చేశాం’ అని హస్సీ చెప్పాడు.

Also Read: Hardik Pandya: గుజరాత్ టైటాన్స్ బౌలర్లను హార్దిక్ పాండ్యా ఇబ్బంది పెట్టాడా?

‘మ్యాచ్‌ ముందుకు సాగే కొద్దీ ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ కీలకం అవుతుంది. అదనంగా బ్యాటర్‌ లేదా బౌలర్‌ అవసరమైతే.. అప్పుడు ఆ నిబంధనను ఉపయోగించుకోవాలని మేం భావించాం. అంతేకాకుండా మా బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలాన్ని పరీక్షించుకున్నాం. ఎంఎస్ ధోనీ 8వ స్థానంలో వచ్చేవాడే. ఆ స్థానంలో దూకుడుగా బ్యాటింగ్‌ చేస్తాడు. జట్టులోని ప్రతి బ్యాటర్ వేగంగా ఆడేందుకు ప్రయత్నించాలని ప్రధాన కోచ్ చెప్పాడు. ఒకవేళ దూకుడుగా ఆడుతూ ఔటైనా ఫర్వాలేదని ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తాం’ అని మైక్‌ హస్సీ చెప్పుకొచ్చాడు.

Show comments