Site icon NTV Telugu

GT vs CSK : పది ఓవర్లు ముగిసే సరికి స్కోర్‌ ఇలా..

Csk

Csk

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. నాలుగు సంవత్సరాల తర్వాత స్వదేశంలో ఐపీఎల్‌ జరుగుతోంది. అయితే.. ఈ నేపథ్యంలో ప్రారంభ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు తలపడుతున్నాయి. గుజరాత్‌ టైటాన్స్‌ జట్టుకు హార్దిక్‌ పాండ్యా సారథ్యం వహిస్తుండగా.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు మహేంద్ర సింగ్‌ ధోనీ కెప్టెన్‌గా ఉన్నారు. అయితే. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన గుజరాత్‌ టైటాన్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో సీఎస్కే ఓపెనర్‌ రుతురాజ్ గైక్వాడ్ తన బ్యాట్‌తో మ్యాజిక్‌ చేశాడు. హార్దిక్ వేసిన తొలి ఓవ‌ర్‌లో రెండు బౌండ‌రీలు కొట్టాడు.

Also Read : Jagan Cabinet Expansion Live: జగన్ కేబినెట్ టీం 3.0లైవ్

Ipl Ad

దాంతో, 11 ప‌రుగులు వ‌చ్చాయి. డెవాన్ కాన్వే(1), రుతురాజ్(11) క్రీజులో ఉన్నారు. రెండు ఓవ‌ర్ల‌కు సీఎస్కే 13 ర‌న్స్ చేసింది. ష‌మీ వేసిన తొలి ఓవ‌ర్‌లో కేవ‌లం రెండు ప‌రుగులు స్కోర్‌ చేయగలిగింది సీఎస్కే. అయితే.. గుజ‌రాత్ టైట‌న్స్ బౌల‌ర్ ష‌మీ బిగ్ సీఎస్కే ఓపెనర్‌ డెవాన్ కాన్వే(1)ను బౌల్డ్ చేశాడు. రెండో ఓవ‌ర్ మొద‌టి బంతికే కాన్వేను పెవిలియ‌న్ పంపాడు షమీ. దాంతో, 16వ సీజ‌న్‌లో తొలి వికెట్‌ను షమీ తన ఖాతాలో వేసుకున్నాడు. 10 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే స్కోర్‌: 93/3. క్రీజులో రుత్‌రాజ్‌(57), రాయుడు(3) పరుగులతో ఉన్నారు.

Also Read : Jagan Cabinet Expansion Live: జగన్ కేబినెట్ టీం 3.0లైవ్

Exit mobile version