Site icon NTV Telugu

Telangana CM: ఎల్బీ స్టేడియంలో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం… ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

Cm

Cm

హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఎల్లుండి (గురువారం) జరగనున్న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సీఎంతో పాటు మంత్రి మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ సమావేశం నిర్వహించి సమీక్షించారు. అధికారులందరూ సమన్వయంతో పని చేసి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. ప్రమాణ స్వీకారానికి వచ్చే వారికి తగిన బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను సీఎస్ ఆదేశించారు. అగ్నిమాపక యంత్రాలు, అగ్నిమాపక శకటాలను వేదిక దగ్గర ఉంచాలి.. అలాగే, వేదికను శుభ్రపరచడం, త్రాగు నీరు ఫాగింగ్ చేయడం వంటివి చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను సీఎస్ శాంతికుమారి కోరారు.

Read Also: Utter Pradesh: యూపీలో ఘోరం.. బాలికపై గుర్తు తెలియని యువకుడు అత్యాచారం

ఇక, ఎల్బీ స్టేడియం దగ్గరకు వెళ్లే రహదారుల మరమ్మతులు చేపట్టాలని సీఎస్ శాంతికుమారి సూచించారు. అన్ని సౌకర్యాలతో కూడిన అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. అదే విధంగా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఇంధన శాఖ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎస్ఏఎమ్ రిజ్వీ, శైలజా రామయ్యర్, గవర్నర్ సెక్రటరీ సురేంద్ర మోహన్, జీఏడీ సెక్రటరీ శేషాద్రి, సెక్రటరీ ఆర్ అండ్ బీ శ్రీనివాస్ రాజు, కమిషనర్ ఐఅండ్ పీఆర్ అశోక్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Exit mobile version