NTV Telugu Site icon

Fraud : జేబీఆర్ క్రిప్టో కరెన్సీ మోసంలో కొత్తకోణం

Bitcoin Fraud

Bitcoin Fraud

Fraud : క్రిప్టో కరెన్సీ పేరుతో దాదాపు రూ.100 కోట్ల వరకు వసూలు చేసి దుబాయ్‌ పారిపోదామనుకున్న రమేష్‌ గౌడ్‌ వ్యవహారం మరో విషయం వెలుగులోకి వచ్చింది. క్రిప్టో కరెన్సీ పేరు చెప్పి కరీంనగర్ వరంగల్ జిల్లాలో 100 కోట్లు వసూలు చేశాడు రమేష్. రమేష్ ని కాపాడేందుకు సీఐడీ అధికారుల ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్టోబర్‌లో కేసు నమోదు అయినప్పటికీ అరెస్టు చేయడంలో నిర్లక్ష్యం చేశారని ఆరోపణలు వెలుగు చూశాయి. నిందితుడైన రమేష్ తో పలుమార్లు హైదరాబాద్ వరంగల్, కరీంనగర్ లో సీఐడీ అధికారుల భేటీలు నిర్వహించారు. రమేష్, సీఐడీ అధికారుల కదలికలపై ఎప్పటికప్పుడు స్పై ఆపరేషన్ చేశారు బాధితులు. రమేష్ తో పలుమార్లు సీఐడీ అధికారులు కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేశారని ఆరోపణలు చేస్తున్నారు బాధితులు. జేబీఆర్‌ క్రిప్టో రమేష్ పై చేసిన స్పై ఆపరేషన్ ఉన్నతాధికారులకు బాధితులు పంపినట్లు తెలుస్తోంది.

 
Gold Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?
 

ఆడియో వీడియోలను చూసిన తర్వాత చర్యలకు ఉన్నతాధికారులు ఉపక్రమించినట్లు సమాచారం. కరీంనగర్ జిల్లా సీఐడీ అధికారులను అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. రమేష్ భార్య, డ్రైవర్ అని అధికారులు వదిలేస్తారా అంటూ బాధితులు వాపోతున్నారు. జేబీఆర్ ఆస్తులతో పాటు అన్ని ఆస్తులను వెంటనే అటాచ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు.

NVS-02 satellite: ఇస్రోకి ఎదురుదెబ్బ.. నిర్ధేశిత కక్ష్యలోకి చేరని NVS-02 ఉపగ్రహం