NTV Telugu Site icon

Rythu Runa Mafi: తెలంగాణలో రుణమాఫీ షురూ.. తొలిరోజు 44,870 మంది రైతులకు లబ్ది

Runa Mafi

Runa Mafi

Rythu Runa Mafi: తెలంగాణలో రైతుల రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైంది. రుణమాఫీ చెల్లింపులకు రూ.167.59 కోట్లు ఆర్థికశాఖ నుండి విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాట ప్రకారం నేడు రూ.37 వేల నుండి రూ.41 వేల మధ్యన ఉన్న రుణాలు మాఫీ అయ్యాయి. దీంతో 44,870 మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ రైతుల తరఫున రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Also Read: Bhatti Vikramarka: ధైర్యం ఉంటే 20 రోజులు సభ పెట్టాలి.. చిట్‌చాట్‌లో భట్టి కీలక వ్యాఖ్యలు

రైతు రుణమాఫీని తక్షణమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆర్థిక శాఖ అధికారులను బుధవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియను గురువారం నుంచే పునఃప్రారంభించాలని స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. రూ.లక్షలోపు రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని 2014లో ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్‌ నెరవేర్చిన విషయం కూడా తెలిసిందే. 2018లో మరోసారి రుణమాఫీ హామీ ఇచ్చారు.

Also Read: HMDA: రికార్డు స్థాయి ధర పలికిన కోకాపేట భూములు.. ఎకరం రూ.72 కోట్లు

2018లో ఇచ్చిన హామీ మేరకు రూ. 36 వేల వరకు ఉన్న రుణాలను మాఫీ చేశారు. తాజాగా మిగిలిన రుణాల మాఫీకి పచ్చజెండా ఊపారు. రుణమాఫీ పున:ప్రారంభ ప్రక్రియ గురువారం నుంచే ప్రారంభించాలని, మొత్తం రుణాలను 45 రోజుల్లోగా అంటే సెప్టెంబర్‌ రెండో వారంలోగా పూర్తిచేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావును సీఎం ఆదేశించారు. తొలి విడత ప్రభుత్వంలో మొత్తం 35.31 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.16,144 కోట్ల పంట రుణాలను మాఫీ చేశారు.

.

Show comments