Cristiano Ronaldo YouTube Channel: ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డోకు రికార్డులు కొత్తేమీ కాదు. మైదానంలో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన పోర్చుగల్ ఫుట్‌బాల్ యోధుడు యూట్యూబ్‌లో కూడా ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాడు. తన యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించిన 24 గంటల్లోనే ఏకంగా 25 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను సంపాదించాడు. ఇది ఓ ప్రపంచ రికార్డు. ప్రస్తుతం రొనాల్డో యూట్యూబ్ ఛానెల్‌కు 28 మిలియన్ల సబ్‌స్కైబర్లు ఉండడం విశేషం.
కంటెంట్ క్రియేటర్‌గా మారదామనే ఆలోచనతో ‘యుఆర్ క్రిస్టియానో’ పేరుతో రొనాల్డో ఓ యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించాడు. ఈ ఛానెల్ మొదలుపెట్టిన గంటలోపే 10 లక్షల మంది సబ్‌స్కైబర్లు రొనాల్డో ఖాతాను అనుసరించారు. దాంతో అత్యంత వేగంగా మిలియన్ సబ్‌స్కైబర్ల ప్రపంచ రికార్డు బద్దలైంది. ఇక 24 గంటల్లో యుఆర్ క్రిస్టియానో ఛానెల్‌ను సబ్‌స్కైబ్ చేసుకున్న వారి సంఖ్య రెండు కోట్లకు చేరింది. ఇది కూడా ఓ ప్రపంచ రికార్డే. ఒక్కరోజు వ్యవధిలోనే గోల్డెన్ ప్లే బటన్ (ఛానెల్‌ను 10 లక్షల ఖాతాదారులు అనుసరిస్తున్నందుకు) పోర్చుగల్ వీరుడు అందుకున్నాడు.
Also Read: Archana Kamath Quits: 24 ఏళ్లకే రిటైర్మెంట్.. కారణం ఏంటో తెలుసా?
క్రిస్టియానో రొనాల్డోకు సోషల్ మీడియాలో 900 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండడం విశేషం. ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్.. అన్ని కలిపి 900 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించిన వెంటనే రొనాల్డో 12 వీడియోలను అప్‌లోడ్ చేశాడు. రొనాల్డో తాను చేసే ప్రతిదీ యూట్యూబ్‌లో పెట్టనున్నాడు.