Criminal Cases On MP: మంగళవారం నాడు వెలుబడిన ఎన్నికల ఫలితాలలో కొత్తగా ఎన్నికైన 543 మంది లోక్‌సభ సభ్యులలో 280 మంది మొదటిసారి లోకసభలో అడుగు పెట్టబోతున్నారు. ఇక 543 మందిలో ఏకంగా 251 మంది మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇది ఎన్నికైన వారిలో 46 శాతంగా ఉంది. ఇందులో 27 మంది దోషులుగా నిర్ధారించబడ్డారని సమాచారం. లోక్ సభకు ఎన్నికైన అత్యధిక సంఖ్యలో నేరారోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థుల వివరాలు చూస్తే..
Annamalai: కమలం ఎప్పటికీ వికసించదు, అన్నామలై రాజీనామా చేయాలి..కనిమొళి డిమాండ్..
ఈ ఏడాది గెలిచిన 251 మంది అభ్యర్థుల్లో 170 మంది 31% అత్యాచారం, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాలతో సహా తీవ్రమైన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. ఇది కూడా 2019లో 159 (29%) ఎంపీలు, 2014లో 112 (21%) ఎంపీలు, 2009లో 76 (14%) ఎంపీల కంటే ఎక్కువ అని విశ్లేషణలో తేలింది. 2009 నుంచి ఇప్పటికి తీవ్రమైన క్రిమినల్ కేసులున్న ఎంపీల సంఖ్య 124% పెరిగింది.
27 మంది గెలుపొందిన అభ్యర్థులు క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలగా, అందులో నలుగురు ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం హత్యకు సంబంధించిన కేసులు, 27 మంది ఐపీసీ సెక్షన్ 307 ప్రకారం హత్యాయత్నానికి సంబంధించిన కేసులు ప్రకటించారు. గెలిచిన పదిహేను మంది అభ్యర్థులు ఐపీసీ సెక్షన్ 376 కింద అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు సహా మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను ప్రకటించారు. అంతేకాకుండా గెలిచిన నలుగురు అభ్యర్థులు కిడ్నాప్‌కు సంబంధించిన కేసులను ప్రకటించారు. అలాగే 43 మంది ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన కేసులను ప్రకటించారు.
Satyabhama: దర్శకత్వం అమ్మలాంటి పని.. నిర్మాతగా ఉండటం నాన్న లాంటి బాధ్యత: శశికిరణ్ తిక్క ఇంటర్వ్యూ
2024 లోక్‌సభ ఎన్నికల్లో క్రిమినల్ కేసులున్న అభ్యర్థికి గెలిచే అవకాశాలు 15.3% ఉండగా, స్వచ్ఛమైన నేపథ్యం ఉన్న అభ్యర్థులు కేవలం 4.4% మాత్రమేనని విశ్లేషణలో తేలింది. 18వ లోక్‌సభలో అతిపెద్ద పార్టీగా అవతరించిన 240 మంది గెలుపొందిన బీజేపీ అభ్యర్థుల్లో 94 మంది (39%) క్రిమినల్ కేసులను ప్రకటించారని ఏడీఆర్ పేర్కొంది. కాంగ్రెస్ గెలిచిన 99 మంది అభ్యర్థుల్లో 49 మంది (49 %) క్రిమినల్ కేసులను ప్రకటించగా, సమాజ్ వాదీ పార్టీకి చెందిన 37 మంది అభ్యర్థుల్లో 21 మంది (45 %) క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. టీఎంసీకి చెందిన 29 మందిలో 13 మంది (45%), డీఎంకేకు చెందిన 22 మందిలో 13 మంది (59%), టీడీపీకి చెందిన 16 మందిలో ఎనిమిది మంది (50%), శివసేన ఏడుగురు గెలిచిన అభ్యర్థుల్లో ఐదుగురు (71%) నేరస్థులుగా ప్రకటించారు.