Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Film Celebrity Interviews Sasikiran Thikka Interview For Sathya Bhama Movie

Satyabhama: దర్శకత్వం అమ్మలాంటి పని.. నిర్మాతగా ఉండటం నాన్న లాంటి బాధ్యత: శశికిరణ్ తిక్క ఇంటర్వ్యూ

Published Date :June 6, 2024 , 4:53 pm
By Bhargav Chaganti
Satyabhama: దర్శకత్వం అమ్మలాంటి పని.. నిర్మాతగా ఉండటం నాన్న లాంటి బాధ్యత: శశికిరణ్ తిక్క ఇంటర్వ్యూ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sasikiran Thikka Interview for Satyabhama Movie:’గూఢచారి’, ‘మేజర్’ చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు శశికిరణ్ తిక్క. ఆయన ప్రెజెంటర్, స్క్రీన్ ప్లే రైటర్ గా వర్క్ చేసిన మూవీ “సత్యభామ”. ‘క్వీన్ ఆఫ్ మాసెస్’ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా అవురమ్ ఆర్ట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది. శ్రీనివాసరావు తక్కలపల్లి, బాబీ తిక్క ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించారు. “సత్యభామ” సినిమాకు సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. రేపు ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న నేపథ్యంలో మూవీ హైలైట్స్ తెలిపారు చిత్ర సమర్పకులు, స్క్రీన్ ప్లే రైటర్ శశికిరణ్ తిక్క.

– నిన్న “సత్యభామ” సినిమా ప్రీమియర్స్ వేశాం. చూసిన వాళ్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూకేలో ఉండే మా మిత్రులు రమేశ్, ప్రశాంత్ చెప్పిన కథతో ఈ సినిమా జర్నీ మొదలైంది. ఆ పాయింట్ నచ్చి నేను, దర్శకుడు సుమన్ డెవలప్ చేశాం. అప్పుడు మేజర్ సినిమా జరుగుతోంది. అది పూర్తయ్యాక సెట్స్ మీదకు తీసుకెళ్లాలని అనుకున్నాం. కాజల్ గారికి “సత్యభామ” కథ చెప్తే ఆమెకు వెంటనే నచ్చింది. అలా ప్రాజెక్ట్ బిగిన్ అయ్యింది.

Also Read

  • Darling Re-release: రీ-రిలీజ్‌లో 'డార్లింగ్' విధ్వంసం.. మైండ్ బ్లాకింగ్ కలెక్షన్స్!
  • Trisha : ఇట్స్ అఫీషియల్.. విజయ్'కి వోట్ వేయమని త్రిష హింట్?
  • Varanasi: అంటార్కిటికాలో బాబు వేట!
  • Aadarsha Kutumbam: ఆ వార్తలన్నీ ఫేక్!

– నాకు దర్శకుడిగా చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నా స్క్రిప్ట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందుకే “సత్యభామ” సినిమాకు దర్శకత్వం వహించలేదు. పైగా మా అవురమ్ ఆర్ట్స్ పై మరిన్ని మూవీస్ చేయాలనుకుంటున్నాం. ప్రొడ్యూసర్ గా అనుభవం కావాలి. డైరెక్షన్ ప్రొడక్షన్ తో పాటు ఎడిటింగ్ కూడా చేయాలని ఉంది.

– మూవీ ప్రెజెంటర్ గా సినిమా మేకింగ్ లో మరో కోణాన్ని చూశాను. దర్శకుడిగా నేను ప్రొడక్షన్ కాస్ట్ ను చెప్పినంతలో చేస్తాననే పేరుంది. ఇప్పుడు “సత్యభామ” నిర్మాత అనుభవాలు ఎలా ఉంటాయో తెలిసింది. ఓవరాల్ గా ప్రొడక్షన్ సైడ్ చాలా విషయాలు నేర్చుకున్నాను. సినిమా మేకింగ్ ను వైడ్ యాంగిల్ నుంచి తెలుసుకున్నా. దర్శకత్వం అమ్మలాంటి పని అయితే నిర్మాతగా ఉండటం నాన్న లాంటి బాధ్యత.

– కాజల్ గారు వెరీ యాక్టివ్. ఆమె అలసిపోయి ఉండటం ఎప్పుడూ చూడలేదు. షూటింగ్ టైమ్ లో ఆమె ఎనర్జీ మా అందరికీ ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేది. ఈ సినిమాలో కాజల్ గారు చేసిన యాక్షన్ సీక్వెన్సులు చాలా స్పెషల్. అవి ప్రేక్షకులను అలరిస్తాయి. ముఖ్యంగా ఎమోషన్ ఈ మూవీలో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఎన్నో పోలీస్ స్టోరీస్ వచ్చినా ఎమోషనల్ గా “సత్యభామ” స్పెషల్ గా ఉంటుంది. ఈ రోజు ఆడియెన్స్ కు తగినట్లు ఫ్రెష్ స్టోరీ టెల్లింగ్ తో ఉండబోతోంది.

– దర్శకుడు సుమన్ చిక్కాల, నేను, శ్రీచరణ్ పాకాల మేమంతా ఫ్రెండ్స్. కలిసే మూవీస్ చేస్తుంటాం. “సత్యభామ” సినిమాకు కూడా అలాగే టీమ్ వర్క్ చేశాం. దర్శకుడిగా సుమన్ వర్క్ ఆకట్టుకుంటుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా మా మూవీ ఉంటుంది. అయితే రెగ్యులర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ లా కేవలం కేసును క్లూలలతో పట్టుకోవడం కాకుండా కథలో ఎమోషన్ బాగా వర్కవుట్ అయ్యింది.

– ఫస్ట్ మేము రిలీజ్ చేసిన సత్యభామ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి సీన్స్ లో కొన్ని ఛేంజెస్ చేశాం. హీరోయిక్ మూవ్ మెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి. అయితే అవి కావాలని పెట్టినట్లు కాకుండా సహజంగా కథ జర్నీలో భాగంగా వస్తుంటాయి. కాజల్ అరవై సినిమాల్లో నటించింది. సత్యభామలో కొత్త కాజల్ ను ప్రేక్షకులు చూస్తారు.

– “సత్యభామ” మూవీలో కాజల్ గారు కాకుండా నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్థన్, రవి వర్మ ఇలా మంచి కాస్టింగ్ కీ రోల్స్ చేశారు. వీళ్లు కాకుండా కొందరు కొత్త వాళ్లు నటించారు. వాళ్లకు ఈ సినిమా రిలీజ్ అయ్యాకు మంచి పేరొస్తుంది. ఈ సినిమా టీమ్ వర్క్ అని చెప్పాలి, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, డైరెక్టర్, నేను, ప్రొడ్యూసర్స్ మేమంతా కలిసే పనిచేస్తూ వచ్చాం. మా మూవీని నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు రిలీజ్ చేస్తున్నారు. ఏపీలో ధీరజ్ మొగిలినేని రిలీజ్ చేస్తున్నారు. ఓవర్సీస్ లో సారిగమ రిలీజ్ చేస్తోంది. ఓటీటీ సహా ఓవరాల్ గా మా సినిమాకు ట్రేడ్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

– మా మూవీ ట్రైలర్ లాంఛ్ లో బాలకృష్ణ గారు పాల్గొన్నారు. రీసెంట్ గా ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ లో ఆయన మంచి మెజార్టీతో గెలుపొందడం సంతోషంగా ఉంది. గూఢచారి 2 సినిమాకు వేరేవాళ్లు దర్శకత్వం చేయాలని నేను, శేష్ ముందే అనుకున్నాం. మహేశ్ బాబు గారు మేజర్ సినిమాలో పార్ట్ అయ్యారు. ఆయనకు సత్యభామ సినిమా చూపించాలని అనుకుంటున్నాం.

– దర్శకుడిగా నా నెక్ట్ ప్రాజెక్ట్ ను త్వరలో అనౌన్స్ చేస్తాను. బ్యాక్ టు బ్యాక్ థ్రిల్లర్స్ చేస్తున్నారనే ప్రశ్న నెక్ట్ టైమ్ మనం కలిసినప్పుడు మీరు అడగరు అని భావిస్తున్నా. మల్టీపుల్ జానర్ మూవీస్ చేస్తాను.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kajal Aggarwal
  • Sasikiran Thikka
  • satyabhama movie

తాజావార్తలు

  • Friday Horoscope: శుక్రవారం రాశి ఫలాలు.. ఆ రాశివారు ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దు.!

  • Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు

  • Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్‌గా తయారు చేయండి.. వన్‌ మోర్‌ అనాల్సిందే..

  • Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

  • India New Gaming Rules 2026: సర్కార్‌ సరి కొత్త గేమింగ్ రూల్స్‌.. ప్రయోజనకరమా లేక హానికరమా..?

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions