Site icon NTV Telugu

Bihar Crime: బీహార్లో పెరుగుతున్న క్రైమ్.. 24 గంటల్లో 10 మంది హత్య

Bihar Crime

Bihar Crime

బీహార్‌లో హత్యల పరంపర ఆగడం లేదు. హత్య కేసులు ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. బీహార్‌లో గత 24 గంటల్లో 10 మంది హత్యకు గురవ్వడం సంచలనం రేపుతుంది. పాట్నా, బక్సర్, వైశాలి, భోజ్‌పూర్‌లలో ఏడుగురి హత్య తర్వాత.. ఇప్పుడు బీహార్‌లోని బంకాలో జంట హత్యల ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు మోతిహారిలో ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపారు. బంకాలోని పొదల మధ్య ఉన్న బావిలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇద్దరినీ గొంతు నులిమి హత్య చేసి మృతదేహాలను బావిలో పడేసినట్లు సమాచారం. ఈ సంఘటన అమర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బల్లికిట్ట చౌక్ సమీపంలో జరిగింది.

Ravindra Jadeja: 200 వికెట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన జడ్డూ భాయ్

యువకులు ధనియా చక్ గ్రామానికి చెందిన సూరజ్ యాదవ్ (30), సియురి గ్రామానికి చెందిన రాజా రామ్ మండలం (25)గా గుర్తించారు. యువకులిద్దరూ ఒకరికొకరు స్నేహంగా ఉండేవారని చెబుతున్నారు. గుజరాత్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసుకుంటూ ఉండేవారు. అయితే వారిద్దరూ పదిహేను రోజుల క్రితమే ఇంటికి రాగా.. మంగళవారం నుంచి ఇద్దరూ కనిపించకుండా పోయారు. అయితే ఈ మర్డరీ మిస్టరీపై ఇంకా విషయాలు వెల్లడి కాలేదు.

Supreme Court: మూడోసారి పదవీకాలం పొడిగింపు చట్టవిరుద్ధం

కొందరు వ్యక్తులు పూల కోసమని ఓ బావి దగ్గరకు వెళ్లగా.. అక్కడ దుర్వాసన వచ్చింది. దీంతో బావిలోకి చూసే సరికి ఇద్దరు యువకుల మృతదేహాలు నీటిలో తేలియాడుతూ కనిపించాయి. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా.. ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను బావిలోనుంచి బయటకు తీశారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతుడి తండ్రి దిలీప్ మండల్ మాట్లాడుతూ.. తన కుమారుడు రాజారాం మంగళవారం నుంచి కనిపించడం లేదని.. అతని కోసం తీవ్రంగా వెతికామన్నారు. కానీ ఆచూకీ తెలియదలేదని.. ఇప్పుడు మృతదేహం లభ్యమైందని కన్నీరుమున్నీరయ్యాడు.

Exit mobile version