సొంత బావమరిది బతుకు కోరే బావ.. ఆస్తి కోరుకున్నాడు. ఇందుకోసం బావమరిదిని పక్కా ప్లాన్ వేసి హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఆత్మహత్యగా సృష్టించి.. మృతదేహాన్ని అత్తింటివారికి అప్పగించాడు. అయితే అత్తమామలకు అనుమానం రావడంతో బావ బాగోతం అంతా బయపడింది. చివరకు బావ కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి…
నెల్లూరు జిల్లా కావలికి చెందిన శ్రీకాంత్.. గచ్చిబౌలిలో పీజీ హాస్టల్ నిర్వహిస్తున్నాడు. క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్ పెట్టి ఐదు కోట్లు కోల్పోయాడు. పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయిన శ్రీకాంత్.. అత్తింటి ఆస్తిపై కన్నేశాడు. హాస్టల్ నిర్వహణకు మంచి నమ్మకస్తుడు కావాలని అత్తామామకు చెప్పి.. బావమరిదిని హైదరాబాద్ తీసుకొచ్చాడు. బావమరిది చెడు వ్యసనాలకు అలవాటుపడ్డాడని అత్తామామకు చెప్పాడు. కొన్ని రోజులుగా బావమరిదిపై ఆరోపణలు చేస్తూ వచ్చాడు.
Also Read: Jonty Rhodes: నేను లోకల్, నాది గోవా.. జాంటీ రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!
శ్రీకాంత్ ఓ సుపారి గ్యాంగ్ చేత బావమరిదిని హత్య చేయించాడు. ఆ హత్యను ఆత్మహత్యగా సృష్టించాడు. అత్తామామకు విషయం చెప్పి.. మృతదేహాన్ని వారికి అప్పగించాడు. మృతదేహంపై గాయాలు చూసిన అత్తమామలు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హాస్టల్లో ఉన్న సీసీటీవి ఫొటేజ్‌ను పరిశీలించారు. హత్య జరిగిన రోజటి ఫుటేజ్ డిలీట్ అయి ఉంది. దాంతో శ్రీకాంత్‌ను విచారించగా అసలు విషయం చెప్పాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు.