Site icon NTV Telugu

Fraud: రాయితీ ధరకే ఆభరణాలంటూ.. రూ.35 లక్షలు నొక్కేశారు..

Crime News

Crime News

Fraud: అత్యాశ అన్ని అనర్ధాలకి మూలం అని తెలిసి కూడా మనిషి కొన్నిసార్లు తన ఆలోచన శక్తిని కోల్పోతుంటాడు. ఎక్కడైనా ఒక రూపాయి లాభం వస్తుంది అంటే చాలు.. ఆ విషయం చెప్పింది తెలిసిన వాళ్ళ లేదా తెలియని వాళ్ళ అని ఆలోచించరు. రెండు మాటలు మంచిగా మాట్లాడితే చాలు అపరిచితులని అమాయకంగా నమ్ముతారు. ఆ నమ్మించినవాడు చివరికి నట్టేట ముంచిపోతాడు. ఇక చేసేదేమి లేక పోలీసులని శరణు వేడుతారు. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. తాజాగా అలాంటి ఘటనే రాజస్థాన్ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళ్తే.. రాజస్థాన్‌లో మన్మోహన్ చౌహాన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. ఆయన ట్రేడ్ మార్కెటింగ్ చేస్తున్నారు. కాగా మన్మోహన్ చౌహాన్ సంపన్నుడు అని తెలుసుకున్న నరేంద్ర రాథోడ్‌.. మన్మోహన్ చౌహాన్‌తో పరిచయం ఏర్పరచుకున్నారు. అతి కొద్ది కాలంలోనే ఆ పరిచయం స్నేహంగా మారింది. మన్మోహన్ చౌహాన్ నరేంద్ర రాథోడ్‌ని పూర్తిగా విశ్వసించాడు. నరేంద్ర రాథోడ్‌ తను MG రోడ్‌లో ఉన్న ఒక ప్రముఖ నగల దుకాణంలో పనిచేశానని మరియు అతని స్నేహితుడు శర్మకు నగల దూకానం ఉందని.. కానీ శర్మకి వ్యాపారంలో భారీ నష్టాలు వచ్చాయని దానితో అతను తన దగ్గర ఉన్న నగలను కేవలం తక్కువ ధరకే విక్రయిస్తున్నాడని.. బిల్లు కూడా ఇప్పిస్తానని నమ్మబలికాడు.

Also Read: Mumbai Crime: బాలికపై అత్యాచారం చేశాడు.. రూ.10నోట్ ఇచ్చి నోరు మూయించాడు

పూర్తిగా రాథోడ్‌ను నమ్మిన మన్మోహన్ చౌహాన్ చివరికి అతని చేతిలో మోసపోయి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులకి తాను రాసిచ్చిన ఫిర్యాదు పత్రంలో ఇలా పేర్కొన్నారు. “ఆగస్టు 31న రాథోడ్ మా ఇంటికి వచ్చాడు. నేను మా ఇంటి నుంచి రూ.35 లక్షలు తీసుకుని ఎంజీ రోడ్డులోని సహారా మాల్‌కు వెళ్లాను. అక్కడ శర్మ మరియు మాధుర్ మాతో చేరారు. నేను వారికి నగదు ఇచ్చాను. శర్మ మరియు రాథోడ్ డబ్బును లెక్కించడానికి బ్యాగ్‌ ని తీసుకెళ్లారు. అనంతరం మరో బ్యాగ్‌తో తిరిగి వచ్చారు. అందులో రూ. 40 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నాయి. వాటిని తీసుకున్న అనంతరం నేను రాథోడ్‌తో కలిసి శర్మ దుకాణానికి బయలుదేరాను. మార్గం మధ్యలో నలుగురు వ్యక్తులు మమ్మల్ని అడ్డుకుని బ్యాగ్‌ ఇవ్వాల్సిందిగా బెదిరించారు. బ్యాగ్‌ అక్కడే వదిలి పారిపోవాలని సూచించారు. భయంతో నేను అక్కడే బ్యాగ్ వదిలేసి పారిపోయాను. రాథోడ్ ప్లాన్ ప్రకారం ఇలా చేసారని తర్వాత అర్థమైనది ఎలాగైన నా డబ్బులని మీరే వెనక్కి తెచ్చివ్వాలి.” అని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసుల బృందం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుండి నిందితులను పట్టుకుని కోర్టులో హాజరు పరిచారు. కాగా అరెస్టయిన వారిని అరవింద్, గుల్బీర్ సింగ్, సెన్సర్పాల్, నరేంద్ర సింగ్, మహమ్మద్ సలీం అలియాస్ శర్మ, సుందర్ చౌదరిగా గుర్తించారు.

Exit mobile version