అత్యాశ అన్ని అనర్ధాలకి మూలం అని తెలిసి కూడా మనిషి కొన్నిసార్లు తన ఆలోచన శక్తిని కోల్పోతుంటాడు. ఎక్కడైనా ఒక రూపాయి లాభం వస్తుంది అంటే చాలు.. ఆ విషయం చెప్పింది తెలిసిన వాళ్ళ లేదా తెలియని వాళ్ళ అని ఆలోచించరు. రెండు మాటలు మంచిగా మాట్లాడితే చాలు అపరిచితులని అమాయకంగా నమ్ముతారు. ఆ నమ్మించినవాడు చివరికి నట్టేట ముంచిపోతాడు.