T20 World Cup 2026: ప్రపంచ కప్ ముందు టీమిండియాలో అనూహ్య మార్పు.. జట్టుకు దూరమైన స్టార్ ప్లేయర్!

Team India

Team India

T20 World Cup 2026: 2026 టీ20 ప్రపంచ కప్ ప్రారంభానికి కేవలం ఒక రోజు ముందు, భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా గాయం కారణంగా ఈ మెగా టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడని సమాచారం. ఫిబ్రవరి 7వ అమెరికాతో జరిగిన మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఈ బ్యాడ్ న్యూస్ అందింది. ఇటీవల జరిగిన భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్‌‌లో హర్షిత్ గాయపడ్డాడు, దీనితో ఈ ప్లేయర్ మ్యాచ్ మధ్యలోనే నిష్క్రమించాల్సి వచ్చింది. పలు నివేదికల ప్రకారం.. మ్యాచ్ కు ఒక రోజు ముందు రాణా భారత జట్టు నుంచి వైదొలిగాడు.

READ ALSO: Chandrahas Controversy: ఇదేమి ‘యాటిట్యూడ్’ చంద్రహాస్.. మస్త్ ఉందిలే!

ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయం..
టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టులోకి హర్షిత్ రాణా ఎంపికయ్యాడు. అతను ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకుంటాడని అందరూ భావించారు. అయితే ఫిబ్రవరి 4న దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు అతను మోకాలి గాయంతో బాధపడ్డాడు. ఈ మ్యాచ్‌లో అతను ఒక ఓవర్ బౌలింగ్ చేసి, తరువాత మైదానం వదిలి వెళ్లవలసి వచ్చింది. అప్పటి నుంచి హర్షిత్ గాయం గురించి జట్టులో ఆందోళన మొదలైంది. కానీ ఇప్పుడు హర్షిత్ రాణా ప్రయాణం ఈ మెగా టోర్నీ ప్రారంభం కాకముందే ముగిసిందని సమాచారం.

పలు నివేదికల ప్రకారం.. హర్షిత్ రాణా పూర్తిగా కోలుకోలేదు. అతని మోకాలి గాయం తీవ్రంగా ఉంది, అందుకే అతను ఇకపై ఈ టోర్నీలో ఆడలేడు. తాజాగా నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘హర్షిత్‌ రాణా ఇబ్బంది పడుతున్నాడు. ఆ విషయం మాకు ఈ రోజు తెలిసింది. ఒక వేళ హర్షిత్‌ రాణా జట్టుకు దూరమైతే, అది మాకు పెద్ద నష్టం. మేం వేరే కాంబినేషన్లు ప్రయత్నిస్తాం. అయితే మా రిజర్వ్‌ బెంచ్‌ బలంగా ఉంది’ అని పేర్కొన్నాడు.

హర్షిత్ స్థానంలో జట్టులోకి..
భారత జట్టు తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న ముంబైలోని వాంఖడే స్టేడియంలో అమెరికాతో జరుగుతుంది. హర్షిత్ జట్టుకు మంచి బౌలింగ్ ఆప్షన్ అందించడమే కాకుండా, బ్యాటింగ్‌లో కూడా అద్భుతంగా రాణించగలడు. అందువల్ల BCCI అతని స్థానంలో ఎవరిని ఎంచుకుంటుందనేది ఇప్పుడు కీలకంగా మారింది. హర్షిత్ జట్టులో లేనప్పుడు, టీమిండియాకు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లలో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు మాత్రమే మిగిలి ఉంటారు, మూడవ పేసర్‌గా హార్దిక్ పాండ్యా ఉన్నా ఇంకా ఒక ఫాస్ట్ బౌలర్‌కు అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ ఎవరిని వరిస్తుందో మరికొన్ని గంటల్లో తెలిసే అవకాశం ఉంది.

READ ALSO: Toxic Telugu Rights: దిల్ రాజు చేతికి ‘టాక్సిక్’.. తెలుగు రైట్స్‌తో యశ్ సృష్టించిన సెన్సేషన్ ఇదే!