Team India: T20 ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు టీమిండియాకు షాక్ తగిలింది. మీడియం-పేసర్-కమ్-బ్యాట్స్‌మన్ హర్షిత్ రాణా గాయం కారణంగా మొత్తం టోర్నమెంట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వెలువస్తున్నాయి. టోర్నమెంట్ నుంచి రాణా తప్పుకున్న వార్త తెలియగానే, లక్షలాది మంది క్రికెట్ ప్రియులను షాక్‌కు గురి చేసింది. ఎందుకంటే రాణా ఇటీవల కాలంలో జట్టుకు అవసరమైనప్పుడు బ్యాట్, బాల్ రెండింటితోనూ విజృంభిస్తున్నాడు. ఈ క్రమంలో సెలెక్టర్లు రాణా స్థానంలో మహమ్మద్ సిరాజ్‌ను ప్రకటించారని, ఈ నిర్ణయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా ఆమోదించిందని పలు వర్గాలు సూచిస్తున్నాయి.
హర్షిత్ జట్టుకు అవసరమైనప్పుడు బ్యాట్‌తో కూడా 40-50 పరుగులు అందించగలడు. అటువంటి పరిస్థితిలో రాణాను ఏ ఆటగాడితో భర్తీ చేస్తాడో, ఎవరు లోయర్ ఆర్డర్‌లో కూడా బ్యాటింగ్ చేయగలరో తెలుసుకోవడానికి అభిమానులు కూడా చాలా ఆసక్తి చూపారు. రాణా స్థానంలో అనేక మంది పేర్లు అభిమానుల్లో చక్కర్లు కొడుతున్నాయి. వారిలో రియాన్ పరాగ్, మహమ్మద్ సిరాజ్, ఆల్ రౌండర్ షాబాజ్ అహ్మద్ ఉన్నారు. కానీ ఇప్పుడు ఫాస్ట్ బౌలింగ్ అత్యంత ప్రాధాన్యతగా ఉండటంతో, మిగిలిన ఇద్దరు రేసు నుంచి ఔట్ అయినట్లు సమాచారం. హర్షిత్ ప్లే్స్‌లో సిరాజ్ పేరును చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఆమోదం తెలపడంతో, టీమిండియా మహమ్మద్ సిరాజ్ పేరును ICC టెక్నికల్ కమిటీకి సమర్పించింది. ICC కూడా సిరాజ్ పేరును ప్రత్యామ్నాయంగా ఆమోదించిందని సమాచారం.
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అక్టోబర్ 2024లో తెలంగాణ పోలీసు శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా బాధ్యతలు స్వీకరించారు. 2024 T20 ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించినందుకు, తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఈ గౌరవప్రదమైన గ్రూప్-1 స్థాయి ఉద్యోగాన్ని, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నివాస స్థలాన్ని బహుమతిగా ఇచ్చింది.
READ ALSO: Gayapadda Simham: తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’ ట్రైలర్ డేట్ ఫిక్స్!
