క్రికెట్ ఆడుతున్న యువతను ఓ రౌడీ షీటర్ తన అనుచరులతో కలిసి బెదిరించాలని చూశాడు. తాను మద్యం తాగాలని, వెంటనే స్థలం ఖాళీ చేసి వెళ్లిపోవాలని హల్‌చల్ చేశాడు. క్రికెట్ ప్లేయర్స్ కాస్త ఓపిక పట్టినా.. రౌడీ షీటర్ మరింత రెచ్చిపోయాడు. సహనం కోల్పోయిన యువత.. రౌడీ షీటర్‌ను చావబాదారు. ఈ ఘటన ఏపీలోని తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది.
ఆదివారం రాత్రి తిరుపతిలోని కొత్త రోడ్డు సమీపంలో క్రికెట్ ఆడుతున్న యువకులతో మద్యం మత్తులో ఉన్న రౌడీ షీటర్ పప్పు రాయల్ గోడవకు దిగాడు. నేను మద్యం తాగాలి, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించాడు. యువకులు అలానే క్రికెట్ ఆడుతుండగా.. వెళ్లలేదంటే కోడుతానంటూ తన అనుచరులతో వచ్చి బెదిరింపులకు పాల్పడ్డాడు. మాటమాట పెరిగడంతో రౌడీ షీటర్ పప్పు రాయల్‌ను క్రికెట్ ఆడుతున్న యువకులు చితకబాదారు. దాంతో అతడికి గాయాలు అయ్యాయి.
Also Read: Road Accident: చంద్రగిరిలో రోడ్డు ప్రమాదం.. 35 మందికి గాయాలు, కొందరి పరిస్థితి విషమం!
గాయపడిన రౌడీ షీటర్ పప్పు రాయల్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. గత కార్పొరేషన్ ఎన్నికలలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సహా ఇతర టీడీపీ నేతలపై పప్పు రాయల్ దాడి చేశాడు. అంతేకాదు అతడు చాలా గొడవల్లో తలదూర్చాడు. రౌడీ షీటర్ పప్పు రాయల్‌పై పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి.
