NTV Telugu Site icon

World Cup 2023: ఇండియా మ్యాచ్కు తప్ప.. స్టేడియాలకు వేరే మ్యాచ్లకు ఫ్యాన్స్ రారా..!

Fans

Fans

2023 వన్డే వరల్డ్ కప్కు భారత్ ఆతిథ్యమిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అందులో భాగంగా ఈనెల 5 నుంచి వరల్డ్ కప్ మ్యాచ్ లు ప్రారంభమయ్యాయి. మొదటి మ్యాచ్ న్యూజిలాండ్-ఇంగ్లండ్ మధ్య అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. ఇంత పెద్ద ఈవెంట్ లో మొదటి మ్యాచ్ చూడటానికి క్రికెట్ అభిమానులు ఎక్కువగా హాజరుకాలేదు. ఎక్కడో ఒకరు ఏదో టైంపాస్ కోసమన్నట్లు వచ్చి కూర్చున్నారు.

Read Also: Chennai: ఓ వ్యక్తి అకౌంట్కు రూ.2000 పంపితే రూ.753 కోట్లు జమ..

వరల్డ్ కప్ అంటే స్టేడియం మొత్తం జనాలతో కిక్కిరిసిపోవాలి.. కానీ ఏదో ప్రాక్టీస్ మ్యాచ్ అన్నట్లు క్రికెట్ అభిమానులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత జరిగిన మ్యాచ్ల్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. నిన్న (ఆదివారం) జరిగిన చెన్నైలో జరిగిన మ్యాచ్ లో అభిమానులు స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయారు. ఎందుకంటే నిన్న జరిగింది.. ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్. కేవలం ఇండియాకు సపోర్ట్ చేసే క్రికెట్ అభిమానులు.. వేరే దేశాల జట్లను కూడా ఓ కంటచూస్తే వాళ్లలో జోష్ నింపిన వాళ్లవుతారు. వారి జట్లను ప్రోత్సహించేందుకు వారి దేశాల అభిమానులు.. ఎక్కువ సంఖ్యలో ఇండియాకు చేరుకోవడం కష్టం. అందుకని భారత్ తో పాటు మిగతా టీమ్ లను కూడా సపోర్ట్ చేస్తే.. వారు కూడా మంచి జోష్ లో ఉన్నట్లుంటుంది.

Read Also: Atchannaidu: పేదలపై ఆయన చూపేది కపట ప్రేమ..

ఇదిలా ఉంచితే నిన్న జరిగిన మ్యాచ్ లో ఇండియా ఉత్కంఠభరిత విజయం సాధించింది. మొదట్లోనే 3 వికెట్లు కోల్పోయిన భారత్.. ఆ తర్వాత మ్యాచ్ అయిపోయిందనుకుని అందరు అనుకున్న తరుణంలో కింగ్ కోహ్లీ, కేఎల్ రాహుల్ నిలకడగా ఆడి మ్యాచ్ ను గట్టేక్కించారు. ఆ మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది.

Show comments