NTV Telugu Site icon

IND vs ENG: విశాఖలో క్రికెట్ సందడి.. తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు భారీగా..!

Team India

Team India

ఉప్పల్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన టీమిండియా.. రెండో టెస్ట్ మ్యాచ్ కోసం సిద్ధమవుతుంది. అందుకోసం ఇండియా-ఇంగ్లాండ్ విశాఖకు చేరుకున్నాయి. దీంతో విశాఖలో క్రికెట్ సందడి వాతావరణం నెలకొంది. ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు పీఎం పాలెంలో ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియంలో రెండో టెస్ట్ మ్యాచ్ జరగననుంది. అందుకోసం.. ప్రత్యేక విమానంలో ఇండియా, ఇంగ్లాండ్ క్రికెటర్స్ విశాఖ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. దీంతో ఎయిర్ పోర్ట్ క్రికెట్ అభిమానులతో సందడిగా మారిపోయింది. తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం విశాఖ ఎయిర్ పోర్ట్ నుండి రోడ్డు మార్గాన రాడిసన్ బ్లూ హోటల్ కి వెళ్లిపోయారు.

MPs Suspension: బడ్జెట్‌కు ముందు కేంద్రం కీలక నిర్ణయం.. విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ రద్దు

ఇదిలా ఉంటే.. డాక్టర్‌ వైస్‌ రాజశేఖర్‌రెడ్డి క్రికెట్‌ స్టేడియంలో ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులకు కూడా ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించనుంది. అదే విధంగా.. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు రోజుకు 2 వేల మంది చొప్పున 5 రోజులకు 10 వేల మంది విద్యార్థులకు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఉచిత ప్రవేశం కల్పించనుంది. అంతేగాకుండా.. రాష్ట్రంలో ఉన్న క్లబ్‌ క్రీడాకారులు కూడా.. రోజుకు 2,850 మంది చొప్పున.. 5 రోజులకు 14,250 మంది ఫ్రీగా మ్యాచ్‌ చూసే అవకాశం ఇవ్వనుంది.

Stock Markets: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 801, నిఫ్టీ 215 పాయింట్లు పతనం

కాగా.. హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.. దీంతో వైజాగ్ లో గెలుపే లక్ష్యంగా టీమిండియా సన్నద్ధమవుతోంది. సిరీస్ ను 1-1తో సమం చేయాలని భారత్ భావిస్తోంది. అయితే బ్యాటింగ్ వైఫల్యంతో ఓటమిని ఎదుర్కొన్న రోహిత్ సేన.. వైజాగ్ టెస్టులో మార్పులు చేయనున్నారు. మూడు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు సమాచారం.