పెర్త్‌లో జరిగిన యాషెస్ 2025 తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. ఆస్ట్రేలియా విజయానికి హీరోలు మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్. స్టార్క్ తన విధ్వంసకర బౌలింగ్‌తో ఈ మ్యాచ్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. హెడ్ నాల్గవ ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడి తుఫాను సెంచరీ సాధించాడు. దీంతో ఆస్ట్రేలియా కేవలం రెండు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్‌ను గెలుచుకుంది. ఫలితంగా క్రికెట్ ఆస్ట్రేలియాకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అదేంటీ మ్యాచ్ గెలిచింది. మళ్లీ నష్టాలు అంటున్నారేంటీ అని ఆలోచిస్తు్న్నారా? ఆ వివరాలు మీకోసం..
Also Read:IAF AFCAT 2026 Recruitment: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్స్.. కొడితే లైఫ్ సెట్
పెర్త్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో, మొదటి రోజు మొత్తం 19 వికెట్లు పడగొట్టగా, వాటిలో ఏడు వికెట్లు స్టార్క్ ఒక్కడే పడగొట్టాడు. రెండవ రోజు, ఆస్ట్రేలియాకు 205 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు, హెడ్ కేవలం 83 బంతుల్లో 123 పరుగులు చేయడంతో కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించారు. రెండు రోజుల్లో ముగిసిన టెస్ట్ మ్యాచ్ కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. ఇంగ్లీష్ వార్తాపత్రిక ది గార్డియన్ నివేదిక ప్రకారం.. రెండు రోజుల్లో ముగిసిన టెస్ట్ కారణంగా ఆస్ట్రేలియా బోర్డు దాదాపు రూ.17 కోట్ల 35 లక్షల నష్టాన్ని చవిచూసిందని అధికారులు అంచనా వేశారు.
మొదటి రెండు రోజుల్లో మొత్తం 101,514 మంది మ్యాచ్ చూడటానికి వచ్చారు. మొదటి రోజు శుక్రవారం 51,531 మంది, రెండవ రోజు శనివారం 49,983 మంది మ్యాచ్ చూడటానికి వచ్చారు. మూడవ, నాల్గవ రోజు కూడా దాదాపు అంతే సంఖ్యలో క్రికెట్ లవర్స్ మ్యాచ్ చూడటానికి వస్తారని అంచనా వేశారు. కొంతమంది అభిమానులు ఆదివారం టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నారు.
Also Read:Election Rigging: బీహార్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..!
ఈ పరిస్థితికి క్రికెట్ ఆస్ట్రేలియా రీఫండ్ విధానాన్ని అమలులో ఉంచింది. ఒక రోజు మాత్రమే టిక్కెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు ఆ రోజు ఆట జరగకపోతే డబ్బు తిరిగి ఇస్తారు. అదేవిధంగా, మూడవ లేదా నాల్గవ, ఐదవ రోజు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియా నుండి రీఫండ్ లభిస్తుంది. మిగిలిన మూడు రోజుల ఆదాయం లేకపోవడం ఆర్థికంగా గట్టి దెబ్బే తగిలింది. ఈ మ్యాచ్‌లో హెడ్ 69 బంతుల్లో సెంచరీ చేశాడు, ఇది యాషెస్ సిరీస్ చరిత్రలో రెండవ వేగవంతమైన సెంచరీ.