NTV Telugu Site icon

World Cup 2023: కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ.. జట్టులో రోహిత్ శర్మకు దక్కని చోటు! తుది జట్టు ఇదే

Ca World Cup 2023 Team

Ca World Cup 2023 Team

Cricket Australia Announce World Cup 2023 Team: ఐసీసీ ప్రపంచకప్ 2023లో లీగ్ దశ ముగిసింది. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు చేరాయి. ఈ నాలుగు జట్లు నవంబర్ 15, 16 తేదీల్లో సెమీ ఫైనల్స్ ఆడనున్నాయి. ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరిగే తొలి సెమీఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనుండగా.. కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్‌ మైదానంలో జరిగే రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఢీకొంటాయి.

ప్రపంచకప్ 2023లో లీగ్ దశ ముగిసిన నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తన వరల్డ్ కప్ 2023 టీమ్‌ను ప్రకటించింది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో అద్భుతంగా ఆడిన ఆటగాళ్లతో కూడిన 12 మంది జట్టును ప్రకటించింది. అత్యదికంగా భారత్ నుంచి నలుగురు ఆటగాళ్లకు క్రికెట్ ఆస్ట్రేలియా చోటిచ్చింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి చెరో ముగ్గురిని ఎంచుకుంది. న్యూజిలాండ్ మరియు శ్రీలంక నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. సీఏ తన జట్టుకు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా ఎంచుకుంది.

ఓపెనర్లుగా క్వింటన్ డికాక్, డేవిడ్ వార్నర్‌లను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. టాప్ ఆర్డర్ బ్యాటింగ్‌లో రచిన్ రవీంద్ర, విరాట్ కోహ్లీ‌ని తీసుకున్న సీఏ.. మిడిలార్డర్‌లో ఎయిడెన్ మార్క్‌రమ్‌కు చోటు కల్పించింది. ఆల్‌రౌండర్‌ల జాబితాలో గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కొ జెన్‌సెన్, రవీంద్ర జడేజాలకు చోటిచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా.. స్పెషలిస్ట్ బౌలర్లుగా మహ్మద్ షమీ, ఆడమ్ జంపా, జస్‌ప్రీత్ బుమ్రాలను తీసుకుంది. ఇక 12వ ఆటగాడిగా దిల్షాన్ మదుశంకను ఎంపిక చేసింది.

Also Read: Rahmanullah Gurbaz: అఫ్గానిస్థాన్‌ క్రికెటర్ మంచి మనసు.. అర్ధరాత్రి 3 గంటలకు..!

క్రికెట్ ఆస్ట్రేలియా జట్టు:
క్వింటన్ డికాక్ (కీపర్), డేవిడ్ వార్నర్, రచిన్ రవీంద్ర, విరాట్ కోహ్లీ‌ (కెప్టెన్), ఎయిడెన్ మార్క్‌రమ్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కొ జెన్‌సెన్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, ఆడమ్ జంపా, జస్‌ప్రీత్ బుమ్రా, దిల్షాన్ మదుశంక.

 

Show comments