Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించినట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.. సీఆర్డీఏ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడన మంత్రి నారాయణ.. అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్‌కు సంబంధించిన ప్రతిపాదనలను సమావేశంలో ఆమోదించినట్లు వెల్లడించారు. పల్నాడు జిల్లాలోని ఇనాం భూముల స్వాధీనానికి అవసరమైన నిధులను దేవాదాయ శాఖకు అందించేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు.
ఇక, హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టుకు సంబంధించి రేరా ఫీజు చెల్లింపునకు కూడా సీఆర్డీఏ ఆమోదం తెలిపిందన్నారు మంత్రి నారాయణ.. అలాగే భూములు ఇచ్చిన రైతులకు యాన్యుటీ చెల్లింపుపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. మరోవైపు.. విజయవాడ రైల్వే స్టేషన్, బస్టాండ్, కనకదుర్గమ్మ ఆలయం, భవానీ ఐలాండ్ నుంచి వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు రోప్‌వే ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు. కృష్ణా నదిపై అవసరమైన వంతెనల నిర్మాణానికి సంబంధించి కమిటీ ఏర్పాటు చేయాలని కూడా సమావేశంలో నిర్ణయించినట్లు వెల్లడించారు మంత్రి నారాయణ.. కాగా, గత ప్రభుత్వ హయాంలో పూర్తి నిలిచిపోయిన అమరావతి రాజధాని పనులు.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేగంగా సాగుతోన్న విషయం విదితమే.. ఇక, సీఆర్డీఏ సమావేశం అవుతూ.. చేపట్టాల్సిన పనులపై చర్చిస్తూ.. నిర్ణయాలు తీసుకుంటూ.. ఆ పనులు మరింత వేగంగా సాగేలా చర్యలు తీసుకుంటుంది..
Also Read
- Nara Lokesh: మంత్రి లోకేష్‌తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
- AP High Court: డీఎస్సీ-2025 పిల్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్‌ను వాడొద్దు..!
తాజావార్తలు
-
Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
-
Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
-
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
-
Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
-
Discount On iPhone: యాపిల్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్‌పై రూ.17 వేలు తగ్గింపు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!