Katrinakaif : బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ నటనతో పాటు తన హాట్ స్టైల్స్‌తో తన అభిమానులను ఎప్పుడూ ఆకర్షి్స్తుంటారు. కత్రినా 2021లో నటుడు విక్కీ హీరో కౌశల్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందు వీరిద్దరు కొన్నాళ్లు డేటింగ్ చేసుకున్నారు. పెళ్లి తర్వాత కత్రినా-విక్కీ దంపతులనుంచి శుభవార్త కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే, కత్రినా ప్రెగ్నెంట్ సోషల్ మీడియాలో పుకారు వ్యాపించింది. దీనికి కారణం ఆమె లేటెస్ట్ లుక్. సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ ముంబైలో గ్రాండ్ గా ఈద్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి క్యాట్ కూడా హాజరయ్యారు. ఈసారి క్యాట్ గోల్డ్-వైట్ కలర్ అనార్కలి డ్రెస్ లో గ్లామరస్ గా కనిపించింది. కత్రినా కారు దిగి నడిచి వస్తుండగా ఫోటోగ్రాఫర్స్ ఆమె ఫోటోలకోసం ఎగబడ్డారు.
Read Also: Paper Leak Case: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై నేడు హైకోర్టులో విచారణ
అనార్కలి డ్రెస్, చెవులకు చెవిపోగులు, పాదాలకు బూట్లు, దుపట్టా, మేకప్ లిప్‌స్టిక్‌పై రిచ్ డిజైన్‌తో ఆమె లుక్ అద్భుతంగా అనిపించింది. కాకపోతే కత్రినా కొంచెం ఒళ్లు చేశారు. ఫోటో కోసం పోజులిస్తుండగా, క్యాట్ ఒక్కసారిగా పొట్టపై చేతులు వేసుకుని కనిపించింది. దీని కారణంగా, క్యాట్ తన బేబీ బంప్‌ను తన చేతులతో దాచిపెడుతుందని.. ఆమెను చూసిన నెటిజన్స్ గర్భవతి అయ్యారేమో అంటూ సందేహాలు వ్యక్తం చేశారు. ఈ కామెంట్స్ వైరల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై స్పష్టత రావాలంటే కత్రినా స్వయంగా వెల్లడించాలి. కత్రినా కైఫ్ తెలుగులో వెంకటేష్ సరసన మల్లీశ్వరి, బాలయ్య సరసన అల్లరి పిడుగు చిత్రాల్లో నటించారు. మల్లీశ్వరి హిట్ కాగా, అల్లరి పిడుగు డిజాస్టర్ అయింది. దీంతో బాలీవుడ్ లోనే కత్రిన బిజీ అయింది. దాదాపు పదేళ్లపాటు కత్రినా టాప్ హీరోయిన్ గా కొనసాగారు. ప్రస్తుతం కత్రిన మెర్రి క్రిస్మస్, టైగర్ 3 చిత్రాల్లో నటిస్తున్నారు.
Read Also:Monday Bhakthi Tv live: అపమృత్యుభయ నివారణకు ఈ స్తోత్రం పఠించాలి