Site icon NTV Telugu

John Wesley: సీఎం రేవంత్ రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బహిరంగ లేఖ..

John Wesley

John Wesley

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. విశ్వవిద్యాలయాల అభివృద్ధికి బడ్జెట్లో 5 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని తెలిపారు. అలాగే.. ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. రాష్ట్రంలోని 15 యూనివర్సిటీలలో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్స్‌తో పాటు.. బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీలు భర్తీ చేయకపోవడంతో విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందడం లేదని జాన్ వెస్లీ లేఖలో పేర్కొన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్స్‌ను సుదీర్ఘకాలం కొనసాగిస్తున్నారు.. నిధుల కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. ల్యాబ్ పరికరాలు, హాస్టల్స్, మెస్, స్పోర్ట్స్, ఇతర మౌలిక సదుపాయాల సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారని లేఖలో ప్రస్తావించారు.

Read Also: AP Crime: ఏపీలో యూట్యూబర్ అనుమానాస్పద మృతి..

ఇటీవల హస్టల్స్‌లో శ్లాబ్ పెచ్చులు ఊడిపడి విద్యార్థులు గాయపడ్డారు.. వందేండ్ల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీకి న్యాక్ నేషనల్ అస్సెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ గుర్తింపులో వెనుకబడి ఉందని జాన్ వెస్లీ లేఖలో తెలిపారు. యూనివర్సిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి.. విశ్వవిద్యాలయాల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని పేర్కొన్నారు. వీటిని పరిరక్షించేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు.. విద్యార్థినులపై వేధింపులు నిరోధించడానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేయాలి.. రాష్ట్రంలో ఒక్క స్కిల్ యూనివర్సిటీ కాకుండా ప్రతి యూనివర్సిటీని స్కిల్ యూనివర్సిటీగా మార్చేందుకు ప్రణాళికలు తయారు చేయాలని బహిరంగ లేఖలో చెప్పారు.

Read Also: The Devil’s Chair: సంతోషపడాలా? బాధపడాలా? అదిరే అభి ఆసక్తికర వ్యాఖ్యలు

Exit mobile version