Site icon NTV Telugu

BV Raghavulu: విశ్వగురు అయితే.. మోడీ.. ఇజ్రాయిల్‌ యుద్దం ఆపాలికదా..?

Bv Raghavulu

Bv Raghavulu

BV Raghavulu: యుద్ధం వ్యాపించకూడదు అన్న ప్రధాని నరేంద్ర మోడీ మాటలు అక్కడితో ఆగిపోయాయి.. యుద్ధం ఆగకుండా.. అమాయకుల ప్రాణాలు ఎలా నిలబడతాయో మోడీ చెప్పాలి అని డిమాండ్‌ చేశారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. యుద్ధం ఆపమని నరేంద్ర మోడీ.. ఇజ్రాయిల్‌కు ఎందుకు చెప్పలేదు.. విశ్వగురు అయితే ఇజ్రాయిల్ కు యుద్ధం ఆపమని చెప్పి ఉండాల్సింది కదా? ఎందుకు యుద్ధం ఆపలేకపోయారు? అని ప్రశ్నించారు. తీవ్ర వర్షలతో హిమాచల్ ప్రదేశ్ లో కొండచరియలు పడిపోయాయి.. హిమాలయాలతో ఆటలాడుకోకూడదు.. హిమాలయాలతో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని.. టూరిజం పేరుతో హిమాలయాలపై పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేయిస్తుంది కేంద్రం అంటూ విమర్శలు గుప్పించారు.

Read Also: Bigg Boss7 Telugu : బిగ్ బ్రేకింగ్.. హౌస్ లో అమర్ దీప్ కు అస్వస్థత.. ట్రీట్మెంట్ కోసమే..

మరోవైపు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ కామెంట్లకు కౌంటర్‌ ఇచ్చారు రాఘవులు.. భారతదేశంలో పిట్టలు అంటే చాలామందికి గౌరవం.. మమ్మల్ని పిట్టలతో పోల్చినందుకు జీవీఎల్ కు ధన్యవాదాలన్న ఆయన.. మేం పిట్టలమే.. కానీ, బీజేపీ లాగా రాబందుల పార్టీ కాదు అన్నారు. బీజేపీలో ఉందా సయోధ్య..? ఉంటే బండి సంజయ్ ను‌ ఎందుకు మార్చారు..? అని ప్రశ్నించారు. బీజేపీ ది ఏదో వాళ్లు కడుక్కోటం మంచిది అంటూ ఘాటుగా బదులిచ్చారు రాఘవులు.. ఇక. ఎన్నికల్లో పొత్తులపై స్పందిస్తూ.. వైరుధ్యాలు ఉన్నా కలవడం ఒక ముందడుగు తప్ప మరోటి కాదు అన్నారు.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా అలయెన్స్ బలం తెలుస్తుందన్నారు. కాంగ్రెస్, సీపీఐ మధ్య ఒడంబడిక ఉంది.. మేం దానిని కాదని చెప్పం అన్నారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.

Exit mobile version