Site icon NTV Telugu

V. Srinivasa Rao: ఉల్లి రైతులకు మేలు చేయకపోతే రాజీనామా చేయండి..!

Cpm State President V Srinivasa Rao

Cpm State President V Srinivasa Rao

V. Srinivasa Rao: ఉల్లి రైతుకు మేలు చేయకపోతే రాజీనామా చేయండి అంటూ డిమాండ్‌ చేశారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో పర్యటించింది సీపీఎం నేతల బృందం.. ఉల్లి రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు నేతలు.. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉల్లి రైతులు దయనీయ స్థితిలో వున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఉల్లి నాటుకు ఎకరానికి 20 వేలు ఖర్చు అవుతుంది. రవాణా, కూలీ ఖర్చులతో లక్ష రూపాయలు అవుతుంది.. కానీ, క్వింటాల్‌కు రూ.1,200 గిట్టుబాటు ధరను కూడా కూటమి ప్రభుత్వం నిలిపివేయడం దారుణం అన్నారు.. డీబీటీ ద్వారా రైతులకు ఖాతాలో డబ్బులు వేస్తామని చెప్పినా.. ఇప్పటికీ రాలేదని విమర్శించారు..

Read Also: Netanyahu: ఇక పాలస్తీనా రాజ్యం ఉండదు.. మద్దతు దేశాలకు నెతన్యాహు హెచ్చరిక

ఎన్నికల ముందు చంద్రబాబు రైతులకు అనేక హామీలు ఇచ్చారు.. మిర్చికి ప్రకటించిన గిట్టుబాటు ధర ఇప్పటికీ రైతులకు రాలేదన్నారు శ్రీనివాసరావు.. అయితే, రైతుల నుండి ఉల్లి కొనుగోలు చేసి రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాలని సూచించారు.. ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేక పోతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లేనట్లే.. 3 వేలు గిట్టుబాటు ధర కల్పించాలి, ఉల్లి రైతుకు మేలు చేయకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.. మరోవైపు, లైసెన్స్ లేకుండా కర్నూలు మార్కెట్ యార్డులో కొనుగోలు చేస్తున్నారు. టమోటా, ఉల్లి రైతులు ఆందోళనలో వున్నారని తెలిపారు. .అయితే, పన్ను లేకుండా విదేశీ పత్తిని దిగుమతి చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు. మేకిన్ ఇండియా పేరుతో ప్రజలను, రైతులను మభ్య పెడుతున్నారని దుయ్యబట్టారు.. ప్రధాని నరేంద్ర మోడీ మాటలు మానుకొని ఏపీలో ఉల్లి, టమోటా రైతులకు మేలు చేయాలని కోరారు.. కూటమి ప్రభుత్వంలో రైతులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు..

Exit mobile version