BV Raghavulu: బీజేపీది ధృతరాష్ట్ర కౌగిలి.. టీడీపీ, జనసేనలు జతకట్టడం సరికాదు..
- రాష్ట్రంలో టీడీపీ..జనసేనలు బీజేపీతో జతకట్టడం సరికాదు
- సీపీఎం నేత బీవీ రాఘవులు కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BV Raghavulu: రాష్ట్రంలో టీడీపీ, జనసేనలు బీజేపీతో జతకట్టడం సరికాదని సీపీఎం నేత బీవీ రాఘవులు పేర్కొన్నారు. బీజేపీది ధృతరాష్ట్ర కౌగిలి అని.. వాళ్లతో చేరినవాళ్లు దెబ్బతింటారని ఆయన అన్నారు. ఆంధ్రాలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్లు ఇదే విధంగా దెబ్బతిన్నాయన్నారు. ఇప్పుడైనా టీడీపీ, జనసేన పార్టీలు మేలుకోవాలన్నారు. బీజేపీతో స్నేహం చేసిన ప్రాంతీయ పార్టీల పరిస్థితిని ఎలా ఉందో చూస్తున్నామన్నారు. మహారాష్ట్రలో శివసేనను, శరత్ పవార్ నేతృతంలోని ఎన్సీపీని ఏ విధంగా చీల్చారో అందరికీ తెలిసిందేనని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: CM Chandrababu: మరో శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు
Also Read
రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదన్న ఆయన.. శ్రీకాకుళంలోని జంఝావతి ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తి కాలేదన్నారు. ఒడిశాలో ఉన్న వివాదాలను కూడా గత ప్రభుత్వం పరిష్కరించలేకపోయిందన్నారు. ఇప్పుడు అక్కడ బీజేపీ ప్రభుత్వమే ఉందని.. ఏపీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉందని.. ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. పోలవరం ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని కాంట్రాక్టర్‌ను జగన్ మార్చేశారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. వెలుగొండ ప్రాజెక్టు పనులు కూడా పూర్తి కాలేదన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల పురోగతిలో ఆలస్యాన్ని గుర్తించి వాటికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు
అమరావతిలో రాజధాని మూడేళ్లు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారని.. రాష్ట్రానికి రాజధాని లేకుండా జగన్ చేశారని ఆరోపించారు. గతంలో చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా చంద్రబాబు చర్యలు తీసుకోవాలన్నారు. మళ్లీ సింగపూర్.. మలేషియా పేర్లు ఎత్తకుండా చంద్రబాబు పనులు చేయాలని సూచించారు. పరిపాలనకు అవసరమైన ముఖ్యమైన హంగులను కల్పించాలన్నారు. రాజధానిని ఎవరూ మార్చేందుకు వీలు లేకుండా పకడ్బందీ చట్టాన్ని తీసుకురావాలని సీపీఎం నేత బీవీ రాఘవులు ప్రభుత్వానికి సూచనలు చేశారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!