V Srinivasa Rao: ఆంధ్రప్రదేశ్‌కి ప్రధాని నరేంద్ర మోడీ అన్యాయం చేసినా.. చంద్రబాబు, సీఎం వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ మాట్లాడరా? అని నిలదీశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశంలో మత ఘర్షణలు, రెచ్చ గొట్టేలా బీజేపీ కుట్ర చేస్తుందని విమర్శించారు. దేశ ఐక్యత గురించి కాకుండా మతం గురించి ఆలోచన చేసేలా మోడీ విధానాలు ఉన్నాయని దుయ్యబట్టారు. ప్రధాని హోదాలో మోడీ ఒక మతానికి ఎలా కొమ్ము కాస్తారు? అని నిలదీశారు. ఇక, ఏపీకి మోడీ అన్యాయం చేసినా బాబు, జగన్, పవన్ లు మాట్లాడరా? మోడీతో కలిసి నడవడానికి వీరు పోటీ పడుతున్నారా? అని మండిపడ్డారు.
Read Also: Kishan Reddy : సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబును అవమానించారని వ్యాఖ్యానించారు శ్రీనివాసరావు.. పోలీసులు కూడా చట్ట ప్రకారం పని చేయాలని సూచించిన ఆయన.. ప్రజలే నా స్టార్లు అంటున్న సీఎం వైఎస్ జగన్ కు ఆ ప్రజలే బుద్ధి చెబుతారు అని హెచ్చరించారు. ఈ రెండు నెలలు ఎన్నికల సంఘం ఏపీని తమ ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.. ఆసరా పేరుతో మళ్లీ మహిళలని మాయ చేస్తున్నారు అని విమర్శించారు. అంగన్వాడీ మహిళలపై ఇచ్చిన జీవో నంబర్ 2 ని రద్దు చేయాలి డిమాండ్ చేశారు. ఇక, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంపై స్పందించిన ఆయన.. మూడేళ్లు స్పీకర్ తమ్మినేని సీతారాం నిద్ర పోయారా..? ప్రజాస్వామ్య విలువ ఉందా..? గంటా శ్రీనివాసరావు మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే ఇప్పుడు ఆమోదించారు.. విలువలు లేని, రూల్స్ పాటించని స్పీకర్ ను ముందుగా తొలగించాలి డిమాండ్ చేశారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.
