Site icon NTV Telugu

AP CM Jagan: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ

Ramakrishna

Ramakrishna

AP CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. రాష్ట్రంలో మరో విద్యుత్ ఉద్యమానికి ఆస్కారమివ్వకండి అంటూ లేఖలో పేర్కొన్నారు. ప్రజారంజక పాలనంటే పదేపదే విద్యుత్ భారాలు ప్రజలపై మోపటమేనా అంటూ ఆయన ప్రశ్నించారు. 2014-19 విద్యుత్ వినియోగంపై ట్రూ అప్ చార్జీల పేరుతో రూ.2900 కోట్లు వినియోగదారులపై భారం మోపారని.. మరో రూ.3083 కోట్లు గుదిబండ వేసేందుకు సిద్ధమయ్యారని ఆయన అన్నారు.

Read Also: Udayagiri Politics: ఉదయగిరిలో ఉద్రిక్త పరిస్థితులు.. రసవత్తరంగా రాజకీయాలు

2020-21 విద్యుత్ వినియోగంపై ట్రూ అప్ చార్జీల పేరుతో యూనిట్టుకు 65 పైసల వరకు వసూలు చేసే ఆదేశాలు ఇవ్వటం తగునా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల సందర్భంగా విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఇచ్చిన హామీ తుంగలో తొక్కారన్నారు. ఇది మాట తప్పటం, మడమ తిప్పటం కాదా? అంటూ ప్రశ్నించారు. అదానీ బొగ్గు కొనుగోలుకు అధిక ధర ఇస్తూ, ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపటాన్ని ఖండిస్తున్నామన్నారు. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Exit mobile version