Site icon NTV Telugu

CM Jagan : సీఎం జగన్‌కి సీపీఐ రామకృష్ణ లేఖ

Cpi Ramakrishna

Cpi Ramakrishna

సీఎం జగన్‌కి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి వద్ద జర్నలిస్టులపై దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేసి, కఠిన చర్యలు చేపట్టాలని ఆయన లేఖలో డిమాండ్‌ చేశారు. మీడియా ప్రతినిధులను లాక్కెళ్ళి హోటల్లో పడేసి తీవ్రంగా కొట్టడం దుర్మార్గమని ఆయన అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే పత్రిక/మీడియా ప్రతినిధులపై దాడులు అమానుషమని, ఏపీయూడబ్ల్యూజే నేతలు అడిషనల్ ఎస్పీని కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ దుండగులను పట్టుకోలేదన్నారు.

Also Read : Ram Charan: పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం ఊహించని కాంబినేషన్ సెట్…

తక్షణమే ఆసుపత్రి వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇటువంటి ఘటనలు పునరావతం కాకుండా చూడాలని కోరుతున్నామని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. నిన్న మీడియాతో మాట్లాడినా సీపీఐ రామకృష్ణ.. ఈ ఘటనపై జర్నలిస్టు సంఘాల నేతలు దాడికి పాల్పడిని వారిపై చర్యల తీసుకోవాలని అడిషనల్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడం విచారకరమన్నారు. అవినాశరెడ్డి తల్లి ఆరోగ్యం మెరుగుపడిందని కర్నూలు టౌన్‌ సీఐ బయట మాట్లాడటంతో.. ఆయనను అవినాష్‌ రెడ్డి అనుచరులు బూతులు తిట్టారని అన్నారు. అయినా వారిపై కేసు నమోదు కాలేదన్నారు.

Also Read : Tovino Thomas: 2018 సినిమాను ఆదరించిన ప్రతీ ఒక్కరికి నా కృతజ్ఞతలు

Exit mobile version