Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Malayalam Star Hero Tovino Thomas Thank Telugu Audience On 2018 Hit

Tovino Thomas: 2018 సినిమాను ఆదరించిన ప్రతీ ఒక్కరికి నా కృతజ్ఞతలు

Published Date :May 27, 2023 , 3:20 pm
By Shiva Kranthi
Tovino Thomas: 2018 సినిమాను ఆదరించిన ప్రతీ ఒక్కరికి నా కృతజ్ఞతలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

కేరళలో రీసెంట్ టైమ్స్ లో ఇండస్ట్రీ హిట్‌గా నిలబడిన చిత్రం 2018. ఈ చిత్రం నిన్న తెలుగులో విడుదల అయింది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ మాస్టర్‌పీస్‌ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. ప్రస్తుతం ఈ సినిమాకి అనూహ్య స్పందన లభిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కేవలం ప్రశంసలకు మాత్రమే కాకుండా కలక్షన్స్ వర్షం కూడా కురిపిస్తుంది ఈ సినిమా. 2018 కేరళలో ఏర్పడ్డ వరదల ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఈ చిత్రంలో టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, శ్శివద, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్, మరియు జాయ్ మాథ్యూ, సుధీష్ ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా 2018 చిత్ర సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర బృందం.

నిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ… “కంటెంట్ స్ట్రాంగ్ ఉంటుంది మలయాళం సినిమాలలో, కథను చాలా స్ట్రాంగ్ గా చెబుతారు. 2018 వరదలు వచ్చినప్పుడు నేను, దర్శకుడు మారుతీ గారు కేరళలోనే ఉన్నాం. శైలజ రెడ్డి అల్లుడు రీ రికార్డింగ్ లో. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు, ఇంట్లోకి వరదలు వచ్చిన ఫీల్ వచ్చింది. బన్నీ వాసు గారు ఎక్కడ మంచి సినిమా ఉన్న అక్కడ కర్చీఫ్ వేస్తారు. కానీ వాసు గారు ఈ సినిమాకి టవల్ వేశారు. డైరెక్టర్ జ్యూడ్ గారు తెలుగులో ఒక సినిమా చెయ్యాలి అని కోరుకుంటున్నాను. మీడియా ఈ సినిమాకి మంచి సపోర్ట్ చేసింది. థాంక్యూ”.

Also Read

  • Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్
  • Ntr Neel : ఎన్టీఆర్ నీల్ సినిమా రీ షూట్స్.. అసలు విషయం బయటపెట్టిన మైత్రి మూవీ మేకర్స్!
  • Tollywood Star Heroine: అవార్డులా? మాకొద్దు.. డబ్బుంటే పంపండి.. స్టార్ హీరోయిన్ తండ్రి సంచలనం!
  • Ashu Reddy: అంతా ఆయన ఇష్టపూర్వకంగా ఖర్చు చేసిందే.. హైకోర్టులో అషు రెడ్డి సంచలనం!

అపర్ణ బాలమురళి మాట్లాడుతూ… “ఇక్కడికి వచ్చిన అందరికి చాలా థాంక్యూ, వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పుడు ఇంత సపోర్ట్ ఇవ్వడం మాములు విషయం కాదు. 2018 సినిమాలో ఒక పార్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీ గా ఉంది.
ఈ సినిమా రియల్ హీరోస్ కి ఒక ట్రిబ్యూట్. చాలా డబ్బింగ్ సినిమాల ప్రమోషన్స్ కి ఇక్కడికి వచ్చాను. ఈసారి డైరెక్ట్ తెలుగు సినిమా ప్రొమోషన్స్ కి వస్తాను”.

నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ… “ముందుగా తెలుగు మీడియాకు థాంక్స్ చెబుతున్నాను. పబ్లిసిటికి ఎక్కువ టైం లేకపోయినా నేను నమ్మింది ఏంటి అంటే ఈ సినిమాలో ఉన్న కంటెంట్ మనిషి యొక్క హృదయాన్ని కదిలిస్తుందని. ఆ కదిలించడమే నా పబ్లిసిటి అని నమ్మాను. నేను 16, 17 సినిమాల వరకు తెలుగులో ప్రొడ్యూస్ చేసాను.కానీ ఈ సినిమా నాకు ఒక ఎక్స్ట్రా లేబుల్ ఇచ్చింది. ఈ సినిమాకి చాలా మంచి రివ్యూ లు వచ్చాయి. 2018 లో మా గీత గోవిందం అక్కడ తెలుగులో రిలీజ్ చేసి వచ్చిన ఫండ్స్ ను కేరళకు ఆ టైం లో ఫండ్ గా ఇచ్చాము. బహుశా అందుకేనేమో నాకు ఈరోజు ఈ సినిమాను తెలుగులో చూపించే అవకాశం వచ్చింది. టోవినో థామస్ గారు మీకు తెలుగులో అవకాశం వస్తే సినిమాను చెయ్యండి. ఇలాంటి సినిమాలను మనం ఆదరిస్తే ఇంకా మంచి సినిమాలు వస్తాయి. మలయాళం ప్రొడ్యూసర్స్ వేణు గారికి,ఆంటోని గారు, పద్మ కుమార్ గారికి థాంక్యూ. డబ్బింగ్ టీం కి కూడా చాలా థాంక్యూ. అందరికి థాంక్యూ సో మచ్”.

దర్శకుడు జ్యూడ్ ఆంటోని మాట్లాడుతూ… “అందరికి చాలా థాంక్యూ. మీరు ప్రసాద్ లాబ్స్ లో ఈ సినిమా చూసి చివర్లో చప్పట్లు కొడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కి చాలా థాంక్యూ మా సినిమాను ఆదరించినందుకు. మా ప్రొడ్యూసర్స్ కి చాలా థాంక్యూ. బన్నీవాసు గారు 63 లక్షలు 2018 లో కేరళకి ఫండ్స్ ఇచ్చారు. యాదృచ్చికంగా ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో డ్రిస్టుబ్యూట్ చేసారు. బన్నీవాసు సెల్ఫ్ లెస్ పర్సన్. మమ్మల్ని ప్రేక్షకులు , మీడియా బాగా ఆదరించారు.మమ్మల్ని మీరు ట్రీట్ చేసిన విధానం చాలా హ్యాపీ అనిపించింది.ఈ సినిమాను మీరు థియేటర్ లో చూడండి. ఈ సినిమా మిమ్మల్ని నిరాశపర్చదు”.

హీరో టోవినో థామస్ మాట్లాడుతూ… “13 సంవత్సరాల క్రితం కాలేజ్ ట్రిప్ కోసం హైదరాబాద్ వచ్చాను, కోయంబత్తూరు లో చదువుకునేటప్పుడు. నావి కొన్ని డబ్ సినిమాలు ఆహా వీడియోలో ఉన్నాయి. మొదటి సారి ఈ సినిమా ప్రొమోషన్ కోసం హైదరాబాద్ వచ్చాను. ఈ సినిమాను ఊహించని స్థాయిలో రిసీవ్ చేసుకున్నందుకు చాలా థాంక్యూ. మా హార్డ్ వర్క్ ను అప్రీసెట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థాంక్యూ. 2108 సినిమాను ఆదరించిన ప్రతీఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను ఖచ్చితంగా నా తర్వాత సినిమాలు కూడా తెలుగులో డబ్ అయ్యేటట్లు చూస్తాను, ఎందుకంటే మీరు చూపిస్తున్న ప్రేమను ఎవరు వదులుకోవాలి అనుకోరు. ఈ సినిమాకి కేరళలో మాత్రమే కాకుండా అన్నిచోట్లా కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. బన్నీ వాసు గారు ఈ సినిమా రిజల్ట్ ను మార్నింగ్ చూపిస్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. చాలా మందికి సినిమా ఎంటర్టైన్మెంట్, బట్ నా వరకు సినిమా జీవితం. ముందున్న రోజుల్లో ఇంకా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను”.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 2018 Telugu Collections
  • 2018 Tovino Thomas
  • Tovino Thomas
  • Tovino Thomas 2018

తాజావార్తలు

  • RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు

  • Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?

  • Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?

  • AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..

  • Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions