NTV Telugu Site icon

CM Jagan : సీఎం జగన్‌కి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ

Ramakrishna

Ramakrishna

సీఎం జగన్‌కి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరోసారి లేఖ రాశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు మాంగనీసు, నది ఇసుక గనుల లీజు పొడిగించాలన్నారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కు సంబంధించి పలు దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆర్ఐఎన్ఎల్ కు అవసరమైన మాంగనీసు, నది ఇసుక బయట నుండి కొనుగోలు చేయడం తీవ్ర ఆర్థిక భారమన్నారు సీపీఐ రామకృష్ణ. విజయనగరంలో ఉన్న మాంగనీసు గనుల లీజు పొడిగించాలని, అనకాపల్లి జిల్లా కింటాడ క్వార్ట్జ్ గనులు, విజయనగరం జిల్లా సారిపల్లి ఇసుక గనుల లీజును పునరుద్ధరించాలన్నారు.

Also Read : Weight Loss Mistakes: పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.. బరువు తగ్గకపోగా పెరుగుతారు!

ఇదిలా ఉంటే.. విజయవాడలో నిన్న సీపీఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దళితులు, మహిళలు, జర్నలిస్టులపై దాడులను నిరసిస్తూ ఈ సమావేశం చేపట్టారు. ఈ సమావేశానికి అఖిలపక్ష నేతలు, ప్రజాసంఘాల నాయకులు హాజరయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని వివిధ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేశారు. రౌడీయిజాన్ని అరికట్టి ప్రజలకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ, ఏపీలో అఘాయిత్యాలు, దాడులు పెరిగాయని వెల్లడించారు. సోదరిని వేధిస్తున్న వారిని ప్రశ్నించిన బాలుడిని చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చెల్లిని వేధించారని ప్రశ్నిస్తే ఏలూరులో మహిళపై దాడి జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని అన్నారు.

Also Read : Purnananda Case : పూర్ణనంద రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు