మోడీ పదేళ్ళలో అప్పులను 156 లక్షల కోట్లు అప్పులు పెంచాడన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అని అసలు ఉద్యోగాలే ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షాలను కేంద్రంలోని బీజేపీ భయపెడుతోందని ఆయన ఆరోపించారు. స్ధానిక పార్టీలు కేంద్రంలో బీజేపీతో సిగ్గు లేకుండా రాత్రి పూట కలుస్తున్నారని, ఏపీ నుంచీ పగలు ఒకరు రాత్రి ఒకరు ఢిల్లీ వెళ్ళి కలుస్తున్నారన్నారు రామకృష్ణ. ఎన్టీఆర్ కూడా ఏరోజూ కేంద్రానికి లొంగిపోలేదని, ప్రజలకు అన్యాయం చేస్తున్న వారికి వత్తాసు ఎలా పలుకుతారో తెలపాలన్నారు సీపీఐ రామకృష్ణ.
Mohammed Siraj: సోషల్ మీడియా సెన్సేషన్ ఓరీతో మహ్మద్ సిరాజ్.. ఐకానిక్ పోజ్ అదుర్స్!
ఈనెల 20న బిజెపి యేతర పార్టీలు, ప్రజాసంఘాల తో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, రైతులు, ప్రజాసంఘాల నిరసనలకు మా ఉభయ పార్టీలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామన్నారు రామకృష్ణ. అనంతరం సీపీఎం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. టీడీపీ స్వయంగా మరణ శాసనం రాసుకుందన్నారు. ప్రజలకు అన్యాయం చేసిన బీజేపీతో ఎలా చేరారో టీడీపీ చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఏ మత వివాదం జరిగినా టీడీపీ సమాధానం చెప్పాలని, రాష్ట్రాన్ని వల్లకాడుగా మార్చాలని అనుకుంటున్నారా అని ఆయన మండిపడ్డారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా బీజేపతో టీడీపీ చీకటి ఓప్పందం చేసుకుందని ఆయన ఆరోపించారు. ఏ రాష్ట్రలోనూ బిజెపితో కలిసిన స్ధానిక పార్టి సజీవంగా లేదని, సీఎం కి అమిత్ షా సమన్లు ఇస్తే పరుగెత్తుకెళ్ళాడననారు. టీడీపీకి వైసీపీకి ఇక తేడా ఏముందన్నారు శ్రీనివాస రావు. ఉమ్మడి అవగాహనకు వచ్చి పని చేయబోతున్నాన్నారు.
