Ramakrishna: బీజేపీ అంటే బాబు (చంద్రబాబు నాయుడు), జగన్ (వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పవన్ (పవన్ కల్యాణ్) అంటూ సెటైర్లు వేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ప్రకాశం జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు విషయంలో ఆ పార్టీలపై మండిపడ్డారు.. ఇక, వైసీపీ ఆవిర్భావం తర్వాత బీజేపీకి ఒక్కసారి కూడా వ్యతిరేకంగా ఓటు వేయలేదు.. బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లులన్నింటికీ వైసీపీ ఓటు వేసిందని దుయ్యబట్టారు.. మరోవైపు చంద్రబాబు బీజేపీకి ఒకసారి దూరమై తిరిగి దగ్గరయ్యాడని.. రాష్ట్రంలో ఉన్న టీడీపీ, జనసేన, వైసీపీ.. బీజేపీకి మద్దతుగా ఉన్నాయని మండిపడ్డారు.
Read Also: Jagdeep Dhankhar: మాజీ ఉపరాష్ట్రపతి ధన్‌ఖర్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే..! వెలుగులోకి సమాచారం
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో ఇండియా కూటమి అభ్యర్థికి, ఎన్డీఏ అభ్యర్థికి ఓట్లు పడతాయి… కానీ, ఒక్క ఏపీలోనే ఎన్డీఏ అభ్యర్థికి వన్ సైడ్ ఓట్లు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రామకృష్ణ.. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటూ కొత్త నిర్వచనం చెప్పి ఆయన.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని కించపరిచే విధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేస్తున్నారు.. ఇది సరైన పద్దతి కాదని హెచ్చరించారు.. మరోవైపు, ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడింది. పంటలు సాగుకి ఎరువులు దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్.. కేంద్రం వద్ద ఎరువులు తీసుకురాలేకపోయిందని ఎద్దేవా చేశారు.. యుద్ధ ప్రాతిపదికన రైతులకు ఎరువులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ..
